CSK: ఎన్ని విభేదాలున్నా.. మేం ఒక్క‌టే!

Hyderabad: అరుచుకుంటాం.. గొడ‌వ‌లు ప‌డ‌తాం.. విభేదించుకుంటాం.. అయినా మేం ఒక్క‌టే అని నిరూపించారు సూప‌ర్ కింగ్స్ (csk) ఎం.ఎస్ ధోనీ (dhoni), ర‌వీంద్ర జ‌డేజా (jadeja). నిన్న జ‌రిగిన గుజ‌రాత్ టైటాన్స్ వ‌ర్సెస్ చెన్నై సూప‌ర్ కింగ్స్ పోరులో csk అద్భుత‌మైన విజ‌యం సొంతం చేసుకుంది. ఐదోసారి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుని ముంబై ఇండియ‌న్స్‌ను స‌మానంగా నిల‌చింది. csk గెల‌వ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ర‌వీంద్ర జ‌డేజా. లాస్ట్ రెండు బాల్స్‌లో 6, 4 బాది చెన్నైని విన్న‌ర్ చేసేసాడు. గెలిచిన ఆనందంతో ప‌రిగెత్తుకుంటూ త‌న మెంటార్ ధోనీ వ‌ద్ద‌కు వెళ్లి కౌగిలించుకున్నాడు. ధోనీ (dhoni) ఆనందంతో జ‌డేజాను (jadeja) ఎత్తుకుని ఎమోష‌న‌ల్ అయ్యాడు. గ్రౌండ్‌లో వీరి బాండ్ చూడ‌టానికి రెండు క‌ళ్లు స‌రిపోవనే చెప్పాలి.

కొన్ని రోజుల క్రితం సీఎస్‌కే (chennai super kings), డీసీ (delhi capitals) మ్యాచ్‌లో 77 ర‌న్స్‌తో చెన్నై విన్ అయింది. మ్యాచ్ త‌ర్వాత గ్రౌండ్‌లో ధోనీకి (dhoni), జ‌డేజాకి మ‌ధ్య ఏదో గొడ‌వ జ‌రిగింది. అయితే వారిద్ద‌రూ దేని గురించి గొడ‌వ‌పడ్డారు అన్న విష‌యం మాత్రం తెలీలేదు. అదీ కాకుండా జ‌డేజా ఎవరైనా ఖ‌ర్మ అనుభ‌వించ‌క త‌ప్ప‌దు అని పెట్టిన ట్వీట్ మరింత వైర‌ల్ అవుతోంది. అయితే దీనిపై ధోనీ కానీ జ‌డేజా కానీ స్పందించ‌లేదు. కానీ ఎన్ని విభేదాలున్నా మేమంతా ఒక్క‌టే అని ఒక కౌగిలింత‌తో ప్రూవ్ చేసేసారు జ‌డేజా, ధోనీ.