Hardik Pandya: ధోనీ కోసం టైటిల్ వ‌దులుకుంటా!

Hyderabad: IPL ట్రోఫీ వ‌దులుకోవాల్సిన ప‌రిస్థితి వ‌స్తే ధోనీ (dhoni) కోస‌మే వ‌దులుకుంటాన‌ని అంటున్నాడు గుజ‌రాత్ టైటాన్స్(gt) కెప్టెన్ హార్దిక్ పాండ్యా (hardik pandya). నిన్న జరిగిన చెన్నై సూప‌ర్ కింగ్స్ (chennai super kings), గుజ‌రాత్ టైటాన్స్ (gujarat titans) ఉత్కంఠ‌పోరులో సీఎస్‌కే గెలిచి ఐదోసారి ఐపీఎల్ ట్రోఫీ సొంతం చేసుకుంది. ఈ సంద‌ర్భంగా పాండ్య మీడియాతో మాట్లాడుతూ.. “ధోనీ ఈ గెలుపుకి అర్హుడు. ధోనీ టీమే గెల‌వాల‌ని విధి ఎప్పుడో రాసిపెట్టింది. ఒక‌వేళ టైటిల్ వ‌దులుకోవాల్సిన ప‌రిస్థితి నాకు వస్తే నేను ధోనీ కోస‌మే వ‌దులుకుంటా. మంచివాళ్ల‌కు ఎప్పుడూ మంచే జ‌రుగుతుంది. ఇక మా టీం గురించి చెప్పాలంటే. మేం ఒక‌టే నియమాన్ని పెట్టుకున్నాం. క‌లిసే గెలుస్తాం. క‌లిసే ఓడిపోతాం. మా టీం చాలా బాగా బ్యాటింగ్ చేసింది. ఇక సాయి సుద‌ర్శ‌న్ భారీ స్కోర్ చేయించాడు. అయిన‌ప్ప‌టికీ సీఎస్‌కే బాగా ఛేజ్ చేసింది. గుజ‌రాత్ టైటాన్స్ ఓడిపోయింద‌ని బాధ‌గా ఉన్న‌ప్ప‌టికీ నా ఫేవ‌రెట్ ధోనీ టీంతో క‌లిసి ఫైనల్స్‌లో ఆడినందుకు సంతోషంగా ఉంది” అని తెలిపాడు పాండ్య‌.