YS Sharmila: డీకే శివకుమార్‌తో భేటీ..!
Bengaluru: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ డీకే శివకుమార్ (dk shivakumar) తో YSRTP అధినేత వైఎస్ షర్మిల (ys sharmila) సోమవారం భేటీ అయ్యారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించిన డీకేకు షర్మిల అభినందనలు తెలిపారు. డీకేఎస్ ను మర్యాదపూర్వకంగానే కలిశానని షర్మిల చెబుతున్నారు. అయితే.. షర్మిల ఇటీవల పలుమార్లు డీకేను కలిశారు. దీంతో వారి మధ్య తెలంగాణ కాంగ్రెస్‌తో పొత్తుకు సంబంధించి ఆమె చర్చిస్తుందని టాక్ నడుస్తోంది. మరి కొందరు మాత్రం.. తెలంగాణ రాజకీయ పరిస్థితులపై ఆమె డీకేకు అనుసరించారని చెబుతున్నారు. అంతేకాకుండా.. డీకేకు రాజకీయాల్లో అపార అనుభవం ఉండటంతో ఆయనతో తన రాజకీయ భవిష్యత్తు గురించి చర్చించినట్లు సమాచారం. ఇక ఇటీవల షర్మిలతో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఫోన్‌లో మాట్లాడారని చెబుతున్నారు. అయితే.. రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతల్లో ఏ ఒక్కరూ ఇంతవరకు ఎలాంటి షర్మిల కాంగ్రెస్‌లో చేరతారు అన్న అంశంపై ఒక్క ప్రకటన చేయలేదు. దీన్ని బట్టి చూస్తే స్థానిక నాయకులు ఆమె లైట్ తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో అంశం తెరమీదకు వస్తోంది.
షర్మిలను కాంగ్రెస్‌లో చేర్చుకుని ఏపీ అధ్యక్షురాలి పదవిలో కూర్చోబెట్టాలని భావిస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి, తన సోదరుడు జగన్ తో విభేదాలను పరిష్కరించుకునేందుకు మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా కోరేందుకు డీకే శివకుమార్ ను షర్మిల కలిసి ఉండవచ్చని మరో వాదన వినిపిస్తోంది. ఇక ఏది ఏమైనా.. ఇప్పటి వరకు తెలంగాణలోనే నా పోరు అని చెబుతున్న షర్మిల సడన్ గా ఏపీ వస్తే.. ప్రజల్లో ఆమె విశ్వాసం కోల్పోక తప్పదు. జగన్‌పై పోటీకి దిగి ఆలోచన కూడా ఆమె చేయకపోవచ్చు. ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తుతో వెళ్తే.. ఆమెకు ఎలాంటి స్థానం కల్పిస్తారు అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.