TDP Manifesto: ఫైర్‌ అవుతున్న మంత్రులు.. ఎవరేమన్నారంటే?

AP: TDP మినీ మేనిఫెస్టోపై (tdp manifesto) ప‌లువ‌రు మంత్ర‌లు ఫైర్ అవుతున్నారు. 2014లో TDP 650 వాగ్దానాలు చేసి గాలికొదిలేసింద‌ని YCP మంత్రి జోగి రమేష్ విమర్శించారు. ఈ సందర్భంగా జోగి రమేష్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. 650 వాగ్దానాల్లో 10 హామీలనైనా నెరవేర్చలేదని అది డస్ట్ బిన్ మేనిఫెస్టో అని దుయ్యబట్టారు. మేనిఫెస్టోను మాయం చేసిన ఘనుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. చంద్రబాబు చరిత్రే నకిలీ చరిత్ర అని బాబు ఓ డర్టీ ఫెలో దొంగ అని విమర్శించారు. పొత్తుల్లేకుండా ఎన్నికలకు వెళ్లలేని పిరికిపంద చంద్రబాబు అని, 14 ఏళ్లుగా సిఎంగా ఉన్నప్పుడు నిరుద్యోగ భృతి ఏమైందని జోగి రమేష్ ప్రశ్నించారు.

చంద్రబాబుకు పూర్ టు రిచ్ అనే కార్యక్రమం 75 ఏళ్ల వయసులో గుర్తొచ్చిందా అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున నిలదీశారు. మరి ఇన్నాళ్ల రాజకీయ జీవితంలో పేదలను ధనికులుగా ఎందుకు మార్చలేదని ఆయన ప్రశ్నించారు. tdp మహానాడుపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ప్రముఖుల చేత తనను పొగిడించుకోవడం కోసమే దివంగత ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకల్ని నిర్వహిస్తున్నారని మండిపడ్డారు.