Rahul Gandhi: మధ్యప్రదేశ్ ఎన్నికల్లో 150 సీట్లు మావే
Delhi: మధ్యప్రదేశ్‌లో జరగబోయే ఎన్నికల్లో (madhya pradesh elections) కాంగ్రెస్ 150 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (rahul gandhi). మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికల్లో 136 సీట్లు గెలిచిన తర్వాత ఇప్పుడు ఈ ఏడాది చివర్లో జరబోయే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 150 సీట్లు గెలవడం పెద్ద విషయం ఏమీ కాదని అన్నారు. ఈ మేరకు పార్టీ నేతలతో కలిసి సుదీర్ఘ డిస్కషన్స్ చేసామని తెలిపారు. మధ్యప్రదేశ్‌కు చెందిన టాప్ కాంగ్రెస్ నేతలు ఈరోజు మల్లిఖార్జున్ ఖర్గే (mallikharjun kharge), రాహుల్ గాంధీ (rahul gandhi)లను కలిసి చర్చించారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర యూనిట్ చీఫ్ కమల్ నాథ్ (kamalnath) కూడా మీటింగ్‌కు హాజరయ్యారు. మరో నాలుగు నెలల్లో మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు జరగబోతున్నాయని, మధ్యప్రదేశ్ ప్రజలు ఏం కోరుకుంటున్నారో దానని దృష్టిలో పెట్టుకుని ప్రచారం చేయాలనుకుంటున్నట్లు కమల్‌నాథ్ మీడియా వర్గాలతో అన్నారు.
2018లో జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో BJP ఓడిపోయింది. ఆ తర్వాత 2020లో కమల్‌నాథ్ ప్రభుత్వం పడిపోవడంతో BJP పవర్‌లోకి తెచ్చుకుంది. 2005 నుంచి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న శివరాజ్ సింగ్ చౌహాన్‌నే (shivraj singh chauhan) సీఎం అభ్యర్ధిగా నిలబెట్టి మరోసారి పవర్‌ను చేజిక్కించుకోవాలని చూస్తోంది బీజేపీ.