ఈ వారం విడుదల కానున్న సినిమాలు!

Hyderabad: వారం వారం థియేటర్లలో కొత్త సినిమాల సందడి చేస్తుంటాయి. ఇక ఈవారం తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి పలు తెలుగు సినిమాలు(Telugu Movies) విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ వారం విడుదల కానున్న టాలీవుడ్​ సినిమాలేంటో చూద్దాం..

అహింస‌ (Ahimsa)
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు చిన్న‌కొడుకు, హీరో రానా సోద‌రుడు అభిరామ్ ద‌గ్గుబాటి (Abhiram Daggubati) అహింస సినిమాతో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. తేజ(Teja) ద‌ర్శ‌క‌త్వంలో రొమాంటిక్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా జూన్​ 2న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో గీతిక హీరోయిన్‌గా న‌టించగా ర‌జ‌త్‌బేడీ, స‌దా కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

నేను స్టూడెంట్ సార్‌
టాలీవుడ్ నిర్మాత  బెల్లంకొండ సురేష్‌ చిన్నకొడుకు గ‌ణేష్‌బాబు (Ganesh Babu) స్వాతి ముత్యం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. గణేష్​ నటించన రెండో సినిమా నేను స్టూడెంట్ సార్. ఈ సినిమా జూన్ 2న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. రాఖీ ఉప్ప‌ల‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సిమాలో అవంతిక దాసాని హీరోయిన్‌గా టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది.

ప‌రేషాన్ (Pareshan)
తెలంగాణ నేప‌థ్యంలో రాబోతున్న సినిమా ప‌రేషాన్.  ఈ సినిమా కూడా జూన్​ 2న థియేటర్ల‌లో సంద‌డి చేయ‌బోతున్న‌ది. తీరువీర్ హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమాకు హృద‌య‌కాలేయం, కొబ్బ‌రిమ‌ట్ట సినిమాల ఫేమ్ రూప‌క్ రొనాల్డ్ స‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కాగా, ఈ సినిమాను హీరో రానా ద‌గ్గుబాటి రిలీజ్ చేయ‌బోతున్నారు.

చ‌క్ర‌వ్యూహం
సీనియ‌ర్ న‌టుడు అజ‌య్ ప్ర‌ధాన పాత్ర‌ను పోషించిన చ‌క్ర‌వ్యూహం సినిమా జూన్ 2న రిలీజ్ కానుంది. అలాగే ఐక్యూ ది ప‌వ‌ర్ అఫ్ స్టూడెంట్ కూడా ఈ వార‌మే థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.