Hari Hara Veeramallu: పవన్ సినిమా సెట్లో ఫైర్ యాక్సిడెంట్!
Hyderabad: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan), క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘హరిహర వీర మల్లు’(Hari Hara Veeramallu). పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ‘మొఘలు’లపై తిరుగుబాటు చేసిన బందిపోటుగా కనిపించనున్నారు పవన్ కల్యాణ్. ఈ సినిమా నుంచి విడుదల చేసిన గ్లిమ్ప్స్ పవన్ ఫాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించింది. కాగా, అనేక వాయిదాలతో ఈ సినిమా ఆలస్యమవుతోంది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ఊపందుకుంది.
అయితే తాజాగా ఈ సినిమా సెట్లో అగ్ని ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. దుండిగల్ సమీపంలోని బోరంపేట్‌లో ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి వేసిన భారీ సెట్ లో అగ్నిప్రమాదం జరిగిందని సమాచారం. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు కానీ నష్టం మాత్రం భారీగానే ఉందంటున్నారు. పైగా ఇదే సెట్ గతంలో వరదలకు కొట్టుకుపోయే పరిస్థితి వస్తే, అప్పుడు కూడా చాలా ఖర్చు పెట్టి మళ్లీ సెట్ ని రెడీ చేసారు.
జూన్ మొదటి వారం నుంచి ‘హరిహర వీరమల్లు’ సినిమాకి డేట్స్ ఇచ్చారు పవన్. కొత్త షెడ్యూల్ మొదలుపెట్టడానికి క్రిష్ రెడీ అవుతున్న సమయంలో అగ్నిప్రమాదం జరగడంతో షూటింగ్ మళ్లీ వాయిదా పడుతుందని నిరాశపడుతున్నారు అభిమానులు.