VS11: ఫస్ట్​​లుక్.. ఊర మాస్​!

Hyderabad: టాలీవుడ్​ యంగ్​ హీరో, మాస్​ కా దాస్​ విశ్వక్‌సేన్ (Vishwak sen) నటిస్తున్న తాజా చిత్రం విశ్వక్‌ సేన్‌ 11 (VS 11). డైరెక్టర్​ కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్ అందించారు మేకర్స్‌. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటర్నత నందమూరి తారక రామారావు శతజయంతి(NTR 100th Birth anniversary) సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేస్తూ ‘జోహార్‌ ఎన్టీఆర్‌.. తెలుగోడి ఆత్మగౌరవం’ అంటూ VS 11 ఫస్ట్​లుక్‌ను లాంఛ్ చేశారు. విశ్వక్‌సేన్‌ పొట్టి జుట్టు, గుబురు గడ్డం, నోట్లో బీడీతో షర్ట్​ మడతబెడుతూ ఊరమాస్‌ లుక్‌ లో అదరగొట్టాడు. ప్రస్తుతం ఈ పోస్టర్​ నెట్టింట వైరల్​గా మారింది.

హైదరాబాద్‌లో పూజాకార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంఛ్ అయిన ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో డీజే టిల్లు ఫేమ్​ నేహా శెట్టి, అంజలి ఫీ మేల్ లీడ్‌ రోల్స్‌ లో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. విశ్వక్‌ సేన్‌ దీంతోపాటు అడ్వెంచరస్‌ ఫాంటసీ ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న గామి (Gaami)లో కూడా నటిస్తున్నాడు. అంతేకాదు దాస్​కీ ధమ్కీ 2 కూడా ప్రకటించాడు.