Bichagadu 2: ఓటీటీ రిలీజ్​ ఎప్పుడో తెలుసా?

Hyderabad: బిచ్చగాడు 2(Bichagadu 2) సినిమాతో కోలీవుడ్​తోపాటు టాలీవుడ్​ ప్రేక్షకులనీ మెప్పించిన మల్టీటాలెంటెడ్​ హీరో విజయ్​ ఆంటోనీ(Vijay Antony). ఈ సినిమాతో  చాలా కాలం తర్వాత సూపర్​ హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు విజయ్‌. 2016లో వచ్చిన బిచ్చగాడు(Bichagadu) సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా మే 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే సూపర్​ హిట్​ టాక్​తో సక్సస్​ఫుల్​గా రన్​ అవుతోంది. తమిళంలో కంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీకి ఎక్కువగా కలెక్షన్లు వస్తుండడం విశేషం. అందుకే తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాల్లో పర్యటిస్తూ తన సినిమాను మరింత ప్రమోట్‌ చేసుకుంటున్నాడు విజయ్​. కాగా సక్సెస్‌ఫుల్‌గా రెండో వారంలోకి అడుగుపెట్టిన బిచ్చగాడు 2 మూవీ ఓటీటీ రిలీజ్‌ కోసం మూవీ లవర్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీప్లస్‌ హాట్ స్టార్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా జూన్ మూడో వారంలో బిచ్చగాడు 2 స్ట్రీమింగ్‌కు రానున్నట్టుగా తెలుస్తోంది.

తమిళ్‌తో పాటు తెలుగులోనూ ఒకేసారి స్ట్రీమింగ్‌కు రానుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో కావ్యా థాపర్‌ హీరోయిన్‌గా నటించింది. హీరో విజయ్‌ ఆంటోనీనే దర్శకత్వ, సంగీత బాధ్యతలు నిర్వర్తించాడు. విజయ్‌ ఆంటోనీ సతీమణి ఫాతిమా ఆంటోనీ నిర్మాతగా వ్యవహరించారు. అన్నా చెల్లెల్ల సెంటిమెంట్​, యాంటీ బికిల్​ కాన్సెప్ట్​తో వచ్చిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి టాక్​ తెచ్చుకుంటుందో చూడాలి మరి.