AMB Mallకి రానున్న టక్కర్​ చిత్రబృందం!

Hyderabad: కోలీవుడ్​ హీరో సిద్ధార్థ్(Siddharth) నటిస్తున్న తాజా చిత్రం టక్కర్(Takkar)​. చివరగా మహాసముద్రం(Maha Samudram) అనే మూవీలో కనిపించిన ఈ హీరో.. కాస్త విరామం తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నాడు. ‘బొమ్మరిల్లు’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రాలతో టాలీవుడ్​ ప్రేక్షకులను మెప్పించిన సిద్ధార్థ్​ టక్కర్​ సినిమాతో రానున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ మూవీ ఏకకాలంలో విడుదల కానుంది. మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా చేస్తోంది. జూన్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

ఈ సినిమా ప్రమోషన్స్​లో భాగంగా చిత్రబృందం ఈ రోజు హైదరాబాద్​ గచ్చిబౌలిలోని ఏఎంబీ మాల్​(AMB mall)కి రానుంది. ఈ విషయాన్ని మేకర్స్​ అధికారికంగా ప్రకటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ప్యాషన్ స్టూడియోస్ పతాకాలపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కార్తిక్ జీ క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నివాస్ కే ప్రసన్న సంగీతాన్ని సమకూర్చారు.