Sharwanand: క్షేమంగా ఉన్నా.. భయపడొద్దు!

Hyderabad: విభిన్న కథలను ఎంచుకుంటూ చక్కని సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్న హీరో శర్వానంద్(Sharwanand). కొద్దినెలల కింద రక్షిత రెడ్డి(Rakshitha Reddy) అనే అమ్మాయితో శర్వా నిశ్చితార్థం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. కాగా వీళ్లిద్దరి నిశ్చితార్థం రద్దయిందనీ, శర్వానంద్ పెళ్లి చేసుకోవట్లేదంటూ వార్తలు హల్చల్ చేశాయి. అయితే అవన్నీ పుకార్లేనని నిరూపిస్తూ తన పెళ్లి ముహూర్తం అనౌన్స్ చేసి క్లారిటీ ఇచ్చారు శర్వానంద్. జూన్ 2, 3వ తేదీలలో ఆయన వివాహ కార్యక్రమాలు కూడా ఘనంగా రాజస్థాన్లో రాయల్ వెడ్డింగ్ టైప్ లో జరగబోతున్నాయి. కాగా, తాజాగా శర్వానంద్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తోంది. ఆయన ప్రయాణిస్తున్న బ్లాక్ కలర్ రేంజ్ రోవర్ కారు నిన్న రాత్రి ఫిలింనగర్లో అదుపుతప్పి డివైడర్ ని ఢీకొట్టిన విషయం తెలిసిందే. కాగా తనకు జరిగిన ప్రమాదంపై శర్వానంద్​ స్పందించారు.

‘ఈరోజు ఉదయం నా కారు యాక్సిడెంట్ న్యూస్ విని అందరూ కంగారు పడ్డారు. అయితే చాలా చిన్న సంఘటన. నేను పూర్తి క్షేమంగా ఉన్నాను. భయపడాల్సిన అవసరం ఏమి లేదు. మీ ప్రేమకి థాంక్యూ’ అంటూ ట్వీట్ చేశారు.