IIFA: ​అరుదైన గౌరవం అందుకున్న యూనివర్సల్​ స్టార్​​!

Abudhabi: మే 26,27 తేదీల్లో అబుదాబీ వేదికగా ఐఫా(IIFA) వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో భాగంగా యూనివర్సల్​ స్టార్​ కమల్​ హాసన్(Kamal Haasan)​ అరుదైన గౌరవం అందుకున్నారు. ఈ అవార్డు కార్యక్రమంలో ఆస్కార్​ విన్నర్​ ఏ.ఆర్​. రెహమాన్(AR Rahman)​ చేతుల మీదుగా అవుట్​స్టాండింగ్​ అచీవ్​మెంట్​ ఇన్​ ఇండియన్​ సినిమా అవార్డు అందుకున్నారు. భారత సినిమాకు అందిస్తున్న సేవలకుగానూ ఈ గౌరవం అందుకున్నారు.

కాగా, కమల్​ వరుస సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది విక్రమ్​ సినిమాతో సెన్సేషనల్​ హిట్​ అందుకున్నారు కమల్​. లోకేష్​ కనగరాజ్​ రూపొందించిన ఈ సినిమాలో కమల్​ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం శంకర్​ డైరెక్షన్లో రూపొందుతున్న ఇండియన్​ 2 సినిమాలో నటిస్తున్నారు కమల్​. గతంలో సూపర్​హిట్​గా నిలిచిన భారతీయుడు సినిమాకి ఇది సీక్వెల్​గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కమల్​కి జోడీగా కాజల్​ అగర్వాల్​ నటిస్తోంది. నటుడిగా రాణిస్తూనే రాజ్​కమల్​ ప్రొడక్షన్స్​ పేరుతో సినిమాలను కూడా నిర్మిస్తూ సినీ పరిశ్రమకు సేవలందిస్తున్నారు కమల్​.