The India House: నిర్మాతగా మరో సినిమా ప్రకటించిన రామ్​ చరణ్​!

Hyderabad: ఆర్​ఆర్​ఆర్(RRR)​తో గ్లోబల్​ స్టార్​గా మారిపోయారు మెగా పవర్​స్టార్​ రామ్​ చరణ్(Ram Charan)​. హీరోగా ఓవైపు పాన్​ ఇండియా స్థాయి సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తూనే మరోవైపు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. మెగాస్టార్​ చిరంజీవి(Chiranjeevi) రీఎంట్రీ మూవీ ఖైదీ నెం.150తో నిర్మాతగా మారారు రామ్​ చరణ్​. కొణిదెల ప్రొడక్షన్స్​ స్థాపించి ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి సినిమాలను నిర్మించారు. ఇక ఆచార్య, గాడ్ ఫాదర్ మూవీలను వేరే నిర్మాతలతో కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఇపుడు కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడానికి వీ మెగా పిక్చర్స్ అనే సంస్థను స్థాపించారు.

పాన్ ఇండియా ప్రేక్ష‌కులు మెచ్చేలా విల‌క్ష‌ణ‌మైన చిత్రాల‌ను ఈ సంస్థ రూపొందించ‌నుంది. అదే స‌మ‌యంలో యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌టానికి వేదిక‌గా మారబోతుంది.తాజాగా ఈ సంస్థతో అభిషేక్ పిక్చర్స్ కలిసింది. నిర్మాణ సంస్థ ‘వి మెగా పిక్చ‌ర్స్’ బ్యాన‌ర్‌లో విల‌క్ష‌ణ‌మైన క‌థాంశాల‌తో పాటు తిరుగులేని వినోదాన్ని ప్రేక్ష‌కులకు అందిచంటానికి సిద్ధంగా ఉంది. అందులో భాగంగానే తాము ఈ నూతన బ్యానర్​పై నిర్మించనున్న సినిమాను అనౌన్స్​ చేశారు రామ్​ చరణ్​. స్వాతంత్య్ర సమరయోధుడు వీర్ సావర్కర్​ 140వ జయంతి సందర్భంగా పాన్​ ఇండియా సినిమా తీయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో యంగ్​ హీరో నిఖిల్​ సిద్దార్థ్​, బాలీవుడ్​ నటుడు అనుపమ్​ ఖేర్​ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ‘ది ఇండియన్​ హౌస్​’(The Indian House)గా  తెరకెక్కనున్న ఈ సినిమాను డైరెక్టర్​ రామ్​ వంశీ కృష్ణ రూపొందించనున్నారు. ట్విటర్​ ద్వారా ఈ సినిమాను అనౌన్స్​ చేశారు చెర్రీ. ఇక ఈ ట్వీట్​ని రీట్వీట్ ​ చేస్తూ అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.​