New Parliament Building: శ‌వ‌పేటిక‌తో పోల్చిన RJD

Delhi: ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించిన కొత్త పార్ల‌మెంట్ బిల్డింగ్‌ను (new parliament building)  RJD పార్టీ శ‌వ‌పేటికతో పోల్చడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (pm modi) ఈరోజు కొత్త పార్ల‌మెంట్ (parliament) భ‌వ‌నాన్ని ప్రారంభించారు. ఈ నేప‌థ్యంలో RJD పార్టీ చేసిన వ్యాఖ్య‌ల‌పై బిహార్ మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్ట‌ర్ సుశీల్ కుమార్ మోదీ (sushil kumar modi) స్పందించారు. ఇంత‌కన్నా దుర‌దృష్ట‌క‌రం మ‌రొక‌టి ఉండ‌ద‌ని, ప్ర‌జ‌ల డ‌బ్బుతో క‌ట్టించిన ఈ అపురూప‌మైన పార్లెమెంట్‌ను శ‌వ‌పేటిక‌తో పోల్చ‌డానికి వారికి మ‌న‌సెలా వ‌చ్చింద‌ని మండిప‌డ్డారు. ఇప్పుడు కొత్త పార్ల‌మెంట్ ప‌ట్ల వ్య‌తిరేక‌త చూపుతున్న వారు రేపు పార్ల‌మెంట్ స‌మావేశాలు (parliament proceedings) జ‌రిగితే రాకుండా ఉంటారా అని ప్ర‌శ్నించారు. ఆర్జేడీ పార్టీ త‌మ ఎంపీల‌ను పార్లమెంట్‌కు రాకుండా ఆప‌గ‌లుగుతుందా అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. పార్ల‌మెంట్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన ఆర్జేడీపై దేశ‌ద్రోహ కేసు పెట్టాల‌ని డిమాండ్ చేసారు.