Sharwanand: శ‌ర్వానంద్‌కు యాక్సిడెంట్..!

Hyderabad: ప్ర‌ముఖ న‌టుడు శ‌ర్వానంద్‌కు (sharwanand) యాక్సిడెంట్ అయింది. జూబ్లీహిల్స్ (jubilee hills) రోడ్ నెంబ‌ర్ 45 వ‌ద్ద త‌న రేంజ్ రోవ‌ర్ కారు డివైడ‌ర్‌కు ఢీకొట్టింది. దాంతో ఆయ‌న స్వల్వంగా గాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. వెంట‌నే స్థానికులు ద‌గ్గ‌ర్లోని హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. జూన్‌లో శ‌ర్వానంద్ (sharwanand) పెళ్లి వేడుక జ‌ర‌గ‌బోతోంది. మరో వారంలో పెళ్లి ఉంద‌న‌గా ఇలా జ‌ర‌గ‌డంతో ఫ్యాన్స్ ఆందోళ‌న‌కు గుర‌య్యారు. అయితే ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికీ ఏమీ కాలేద‌ని శర్వా టీం క్లారిటీ ఇచ్చింది.