Liquor Scam: కవిత సేఫ్… బీజేపీకి షాక్!?
Hyderabad: ఢిల్లీ లిక్కర్ స్కాం లో (liquor scam) ఆరోపణలు ఎదుర్కొంటున్న కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత (kavitha) మనీ లాండరింగ్ కు పాల్పడలేదని CBI తన చార్జ్ షీట్లో పేర్కొన్నట్లు సమాచారం. అదే జరిగితే కవిత సేఫ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. cbi దాఖలు చేసిన రెండో ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకున్న ప్రత్యేక కోర్టు.. గతానికి భిన్నంగా సీబీఐ తాజా ఛార్జిషీటులో కవిత పేరు ఎక్కడా లేదని అంటున్నారు. కవితను పలుమార్లు ప్రశ్నించినప్పటికీ ఇప్పటివరకు cbi ప్రశ్నించిన వారి జాబితాలో కూడా చేర్చలేదట. ఏప్రిలో 25న రెండో అనుబంధ ఛార్జిషీటును సుమారు 5700 ఛార్జిషీట్ ను సీబీఐ దాఖలు చేసింది. మొదటి ఛార్జిషీటు నవంబర్ 25న దాఖలు చేయగా.. ఆ తరువాత డిసెంబర్ 11న కవితను తొలి విడత హైదరాబాద్ లో సీబీఐ అధికారులు లిక్కర్ స్కాం గురించి ఆమెని ప్రశ్నించారు.
ఇప్పటివరకు 89 మందిని ప్రశ్నించినట్లు ఛార్జ్ షీట్ లో సీబీఐ ప్రస్తావించింది. కవిత విషయంలో దర్యాప్తు సంస్థల వైఖరి సడెన్ గా ఎందుకు మారిందో అర్థం కాని పరిస్థితి ఉంది. స్పష్టమైన ఆధారాలు లేకనా మరేదైనా కారణమా అని ప్రజల్లో చర్చ సాగుతోంది. గతంలో లిక్కర్ స్కాం నిందితులతో ఆమె పలుమార్లు హైదరాబాద్, ఢిల్లీలో సమావేశమయ్యారని.. తాను కవితకు బినామీ అని అరుణ్ పిళ్ళై చెప్పారని.. ఇలాంటి రోటీన్ అభియోగాలనే తిరిగి ఈడి ఛార్జి షీట్లో చేర్చిందని. ఇన్నాళ్ల దర్యాప్తులో సీబీఐ, ఈడీ కలిసి కొత్త విషయాలు వెలుగులోకి తీసుకుని రాలేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అంతే కాకుండా.. కవిత అరెస్ట్ అయితే లాభ పడాలని రాష్ట్ర బీజేపీ భావించినప్పటికీ.. ఇప్పుడు అది సాధ్యపడేలా లేదు. దీనిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు బీజేపీ పై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో తెలియాల్సి వుంది