BRS: ఆత్మీయ‌ సమ్మేళనాలు.. హీట్‌ పెంచుతున్న ప్ర‌సంగాలు!

Hyderabad: తెలంగాణలో (telangana) ఆత్మీయ సమ్మేళనాల హడావిడీ కనిపిస్తోంది. BRS నుంచి సస్పెండ్‌కు గురైన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి, కోదండరామ్‌ ఇలా పలు పార్టీలకు చెందిన నాయకులు ఆత్మీయ సమ్మేళనాలు అంటూ ఒకచోటుకి చేరుతున్నారు. తెలంగాణలో (telangana) అధికారంలో ఉన్న BRS కూడా తాజాగా ఆత్మీయ సమ్మేళనాల కార్యక్రమం చేపట్టింది. దీనిలో ఆ పార్టీ నాయకులు పాల్గొంటున్నారు. ఎన్నికల సమయంలో సాధారణంగా ఇలాంటి సమ్మేళనాలు నిర్వహించడం సహజంగానే జరుగుతుంటుంది. రానున్న రోజుల్లో ఆ ప్రచారం కార్యక్రమాలు ఊపందుకునే చాన్స్‌ ఉంది. ఇక అధికారంలో ఉన్న BRS నాయకులు.. వారి హయాంలో ఎలాంటి అభివృద్ది జరిగింది. ప్రజలకు అందిన సేవల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు మాత్రం అధికార ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతోంది.

తాజాగా మంత్రి హరీష్‌రావు (harish rao) నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండ జిల్లాలో 13 స్థానాల్లో గూలాబీ జెండానే ఎగురుతుందని.. కాంగ్రెస్‌కు 40 నుంచి 50 స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థలు కూడా లేరని విమర్శించారు. 60 ఏళ్లుగా జరగని అభివృద్ది కేసీఆర్ ఒక్కరే చేసి చూపించారని హరీష్ రావు తెలిపారు. ఇప్పటివరకు లక్ష 50 వేల ఉద్యోగాలు ఇచ్చామన్న హరీష్.. ప్రైవేటు రంగంలో 17 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు.