నూతన పార్లమెంట్​ ప్రారంభోత్సవం సందర్భంగా రూ.75 కాయిన్​ విడుదల!

Delhi: నూతన పార్లమెంట్(New Parliament) భవనం ప్రారంభోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం 75 రూపాయల నాణాన్ని(Rs. 75 Coin) విడుదల చేయనుంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం(Central Government) 2 వేల నోట్ల  రద్దు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా 75 రూపాయల నాణేన్ని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 35గ్రాముల బరువుతో 75 రూపాయిల నాణెం ఉండనుంది. 50శాతం వెండి, 40శాతం రాగి, 5శాతం నికెల్​, 5శాతం జింక్​తో 75 రూపాయిల నాణెం తయారు చేయనున్నారు.

నాణెం 44mmసైజులో ముద్రించారు. అశోక స్తంభంపై ఉండే నాలుగు సింహాల చిహ్నం దాని కింద ‘సత్యమేవ జయతే’ అక్షరాలు ఉండనున్నాయి. నాణేనికి ఎడమవైపు దేవనగరి లిపిలో భారత్​,  కుడివైపు ఆంగ్లంలో ఇండియా అని ఉండనుంది. కాయిన్​ ఎగువ అంచుపై సంసద్​ సంకుల్​ అని దేవనగరి స్క్రిప్ట్​లో, దిగువ అంచున పార్లమెంట్​ కాంప్లెక్స్​ ఉండనుంది. ప్రస్తుతం మార్కెట్​లో రూ. 1, రూ. 2, రూ. 5 , రూ.10,రూ.20 కాయిన్లు వాడకంలో ఉన్నాయి. త్వరలోనే వంద రూపాయల కాయిన్​ను కూడా విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.