వాల్‌న‌ట్స్‌తో ఈ వ్యాధుల‌కు చెక్!

డ్రై ప్రూట్స్​ని రోజూవారి ఆహారంలో తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల చాలా రకాల ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్, డయాబెటీస్ వంటి వ్యాధులను తగ్గిస్తాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు శరీరంలో మెటబాలిక్ రేటును క్రమంగా పెంచుతాయి. వాల్‌నట్ నూనెలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు అధికంగా ఉంటాయి. వాల్​నట్స్​ వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం..

*వాల్ నట్స్ బరువు తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులో ఫైబర్, మరియు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.. వాల్ నట్స్‌లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి అన్ని రకాల గుండె సంబంధ సమస్యలను ఎదుర్కొనడానికి సహాయపడతాయి. వీటిలో విటమిన్ ఇ మరియు ప్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జ్ఞాపకశక్తి లోపానికి గురి చేసే హానికరమైన ఫ్రీరాడికల్స్ మరియు కెమికల్స్‌ను నాశనం చేస్తుంది. కనుక దీనిని బ్రెయిన్ ఫుడ్ అని అంటారు.

* వాల్​నట్స్​ రక్తపోటును తగ్గిస్తాయి. నానబెట్టిన వాల్ నట్స్‌ను ప్రతిరోజు 5 చొప్పున తీసుకోవటం వల్ల కీళ్లనొప్పులు, వాపులు తగ్గిపోతాయి. గర్భిణీ స్త్రీలు ఈ నట్స్‌ను తినడం వల్ల శిశువుకు ఎలాంటి ఎలర్జీలు కలుగకుండా వ్యాధినిరోధకతను పెంచుతాయి.

*ప్రతిరోజు వీటిని మన డైట్లో చేర్చుకోవడం వలన శరీరం ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటమే కాకుండా ఆయుష్షు కూడా పెరుగుతుంది. వాల్ నట్స్‌లో మెలటోనిన్ అనే కాంపౌడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది మనం గాఢంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.

*వాల్​నట్​ నూనెలోని ఆమ్లాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. దీనివల్ల గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం కూడా తగ్గుతుంది. గుండె ఆరోగ్యాన్ని ఈ నూనె కాపాడుతుంది. ఈ నూనెలో ఉండే ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు మెదడు ఆరోగ్యానికి కూడా సహకరిస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.

*వాల్‌నట్ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరంలో మంటతో, వాపుతో పోరాడే శక్తిని ఇస్తాయి. క్యాన్సర్, ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను రాకుండా చేయడంలో ఈ నూనె ముందుంటుంది.

*ఈ నూనెలో విటమిన్ E అధికంగా ఉంటుంది. విటమిన్ E చర్మానికి అందాన్ని ఇవ్వడంలో సహకరిస్తుంది. ఈ ఆయిల్ వాడడం వల్ల ఎగ్జిమా, సొరియాసిస్ వంటి చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి. ఈ రెండు సమస్యల బారిన పడినవారు కూడా వాల్‌నట్ ఆయిల్ వాడడం వల్ల త్వరగా వాటినుంచి బయటపడవచ్చు. ఇతర వంట నూనెలతో పోలిస్తే ఈ నూనెలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. కాబట్టి బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారు వాల్‌నట్ ఆయిల్‌ను తమ ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ఈ నూనెను రోజుకో స్పూన్ తాగినా కూడా ఎన్నో రకాలుగా ఆరోగ్యానికి మంచిది. చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలోనూ వాల్​నట్స్​ బాగా ఉపయోగపడతాయి.