AP Elections: ఈసారి రసవత్తరంగా ఎన్నికలు..!
AP: 2024లో జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (ap elections) ఈసారి రసవత్తరంగా ఉండబోతున్నాయి. బరిలో అధికార పార్టీ వైసీపీ (ycp), టీడీపీ (tdp), జనసేన (janasena) ఉన్నాయి. ఏపీలో ఎన్నికలకు (ap elections) ఏడాది సమయం ఉంది. కానీ ఇప్పటికే ఆ హీట్ వచ్చినట్లు కనిపిస్తోంది. మరోవైపు ఈ దఫా.. ఎన్నికల పోరు రసవత్తరంగా మారనుంది. ఒకవైపు టీడీపీ- జనసేన పొత్తుతో బరిలో నిలవనున్నాయని.. వారి మధ్య ఓ అవగాహన వచ్చింది. ఒప్పందం వెళ్లనున్నాయి. వైసీపీ మాత్రం ఒంటరిగా పోటీకి వెళ్లేందుకు సిద్దం అవుతోంది. ఈక్రమంలో నాయకులు ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఆయా పార్టీలకు చెందిన అధినేత ప్రణాళిక ఏవిధంగా ఉంది అన్న అంశాల గురించి ఇప్పడు తెలుసుకుందాం.
సీఎం జగన్ (jagan) ఇప్పటికే నెలకు రెండు మూడు నియోజకవర్గాల్లో బహిరంగ సభలను ఏర్పాటు సంక్షేమ ఫలాలను DBT ద్వారా అందిస్తూ… పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుడుతున్నారు. దీంతోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఇంఛార్జిలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపడుతూ.. ప్రతి ఇంటికీ వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్న తీరు, ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. దీంతోపాటు జగనన్నే మా భవిష్యత్తు లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మరోవైపు TDP అధినేత చంద్రబాబు… ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆయన కుమారుడు నారా లోకేష్ (nara lokesh).. యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టారు. జనసేనాని పవన్ కల్యాణ్ (pawan kalyan) మాత్రం ప్రస్తుతానికి కాస్త సైలెంట్ అయ్యారు. కానీ ఆయన కూడా త్వరలో బస్సు యాత్ర చేపడతారని అంటున్నారు. పవన్ మాత్రం జనసేనకు పట్టు ఉన్న స్థానాల్లోనే ఆ పార్టీ నాయకులను పోటీలో ఉంచేందుకు ప్లాన్ చేస్తోంది. ఇక బీజేపీ మాత్రం ఒంటరిగా ఎన్నికలకు వెళ్తుందా.. లేదా టీడీపీ-జనసేనతో కలిసి పొత్తు ఏర్పాటు చేసుకుంటుందా అన్నది తెలియాల్సి ఉంది.