Australia: ఇండియన్ స్టూడెంట్స్‌ని బ్యాన్ చేసిన యూనివర్సిటీలు
Australia: ఆస్ట్రేలియాకు (australia) చెందిన టాప్ 2 యూనివర్సిటీలు భారత్‌కు చెందిన 6 రాష్ట్రాల స్టూడెంట్స్‌ను బ్యాన్ చేసాయి. విక్టోరియాలోని ఫెడరేషన్ యూనివర్సిటీ, న్యూ సౌత్ వేల్స్‌లోని వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీలు ఇండియాలోని ఈ 6 రాష్ట్రాలకు చెందిన స్టూడెంట్స్‌కు వీసా ఇవ్వొద్దని అక్కడి ప్రభుత్వాన్ని కోరాయి. అవి ఏ రాష్ట్రాలంటే.. పంజాబ్, హర్యాణా, గుజరాత్, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ అండ్ కశ్మీర్. ఈ రాష్ట్రాలకు చెందిన స్టూడెంట్స్‌కు వీసా ఇవ్వొద్దని యూనివర్సిటీలు ఆస్ట్రేలియన్ (australia) ప్రభుత్వాన్ని కోరాయి. ఇందుకు కారణం ఈ రాష్ట్రాల నుంచి ఎక్కువగా ఫ్రాడ్ వీసాలు (fraud visas) రావడం. భారత ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) సోమవారం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఈ ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఈ రాష్ట్రాలకు చెందిన చాలా మంది విద్యార్ధులు 2022లో ఆస్ట్రేలియన్ యూనివర్సిటీల్లో (australian universities) సీట్లు సంపాదించి.. చదువు పూర్తిచేయకుండా ఏదో ఒక ఉద్యోగం వెతుక్కుని మానేస్తున్నారని అధికారులు తెలిపారు. నిజాయతీగా చదువుకోవడానికి రావడం లేదని, ఎలాగో అలా ఓ యూనివర్సిటీలోకి ఎంటర్ అయిపోతే ఆ తర్వాత జాబ్‌తో సెటిల్ అయిపోవచ్చన్న ఆలోచనతోనే వీసాలకు అప్లై చేసుకుంటున్నారని అన్నారు. దాంతో ఈ రాష్ట్రాల నుంచి వచ్చే వీసా అప్లికేషన్లపై నిఘా ఉంచనున్నారు.