Viral News: కోటీశ్వ‌రులే కానీ విసిగిపోయిన జీవితాలు..!

Dubai: కోట్ల‌లో డ‌బ్బు, విలాస‌వంత‌మైన ఇల్లు, అల్ట్రా రిచ్ లైఫ్ కావాల‌ని కోరుకోనివారు ఉండ‌రు (viral news). కానీ పై ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయికి (dubai) మాత్రం అల్ట్రా రిచ్ లైఫ్‌తో విసుగు వ‌చ్చేసింద‌ట‌. ఈ అమ్మాయి పేరు లిండా అనే 23 ఏళ్ల యువ‌తి.. దుబాయ్‌కి (dubai) చెందిన క్రిప్టో ట్రేడ‌ర్ రిక్కీని పెళ్లి చేసుకుంది. దుబాయ్‌లో రిక్కీ టాప్ రిచెస్ట్ ప‌ర్సెన్స్‌లో ఒక‌డు. కోట్ల డ‌బ్బు, ఎక‌రాల్లో విల్లా, ప్రైవేట్ జెట్లు, క్రూజ్ ఇలా అన్నీ ఉన్నాయి. దుబాయ్‌లోని అల్మోస్ట్ అన్ని ఖ‌రీదైన వ‌స్తువులు భార్య‌కు కానుక‌గా ఇస్తుంటాడు. కానీ ఈ జీవితం ఇక త‌న వల్ల కాద‌ని అంటోంద‌ని లిండా. ఎందుకంటే..కోటీశ్వ‌రులు కాబ‌ట్టి ఎక్క‌డికి వెళ్లినా త‌ప్ప‌నిస‌రిగా అన్నీ ఖ‌రీదైనవే వేసుకుని వెళ్లాలి. పోనీ భ‌ర్త‌తో క‌లిసి ప్రైవేట్‌గా టైం స్పెండ్ చేద్దాం అనుకుంటే ఎక్క‌డికి వెళ్లినా వెన్నంటే బాడీగార్డులు ఉంటారట‌. నెల‌లో ఐదు ఆరు సార్లు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ట్రిప్స్‌కి వెళ్లాల్సి వస్తుంద‌ట‌. ఇంత డ‌బ్బు ఉండీ మ‌న‌శ్శాంతి, సుఖం లేద‌ని అంటోంది లిండా. అలాగ‌ని లిండా డ‌బ్బున్న‌వాడిని చూసి పెళ్లి చేసుకోలేదు. ఆమె కూడా దుబాయ్‌లో స‌క్సెస్‌ఫుల్ బిజినెస్‌వుమెన్. డ‌బ్బే అన్ని స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం అనుకుంటాం కానీ డ‌బ్బుతో కూడా మ‌న‌శ్శాంతి ఉండ‌దు అని అంటోంది లిండా.