Ram Charan: మరో ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన చరణ్
Hyderabad: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (ram charan) మరో ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేసారు. తన ఫ్రెండ్ విక్రమ్‌తో కలిసి V మెగా పిక్చర్స్ (V mega pictures) పేరుతో స్థాపించారు. గతంలో విక్రమ్.. ప్రభాస్‌కు (prabhas) చెందిన UV క్రియేషన్స్‌లో ఉండేవారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి కొత్తగా ప్రొడక్షన్ హౌస్ పెట్టారు. ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి కొత్త టాలెంట్, యంగ్ యాక్టర్స్‌కు ఛాన్సులు ఇవ్వాలని అనుకుంటున్నారట. ఆల్రెడీ రామ్ చరణ్ (ram charan) కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ (konidela production company) పేరుతో ఓ నిర్మాణ సంస్థను స్థాపించారు. అందులో కేవలం తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) నటించే సినిమాలన మాత్రమే నిర్మిస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ కొత్త నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి సినిమాలు వస్తాయో వేచి చూడాలి.
ఇక ఇటీవల కశ్మీర్‌లో జరిగిన జG20 సమ్మిట్‌కు వెళ్లిన రామ్‌చరణ్ (ram charan) ఇండియన్ సినిమా గురించి తెలుగు సినిమా గురించి ఎన్నో విషయాలను చర్చించారు. ఆయన సినిమాల విషయానికొస్తే.. శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న గేమ్ ఛేంజర్‌లో (game changer) నటిస్తున్నారు. కియారా అడ్వాణీ హీరోయిన్. దిల్ రాజు ప్రొడ్యూసర్. అయితే.. రామ్ చరణ్ సతీమణి ఉపాసన (upasana) త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. దాంతో ప్రస్తుతం చరణ్ సినిమా షూటింగ్‌ల నుంచి బ్రేక్ తీసుకుని తన భార్యతో కలిసి టైం స్పెండ్ చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. బిడ్డ పుట్టిన తర్వాత కూడా కొంతకాలం గ్యాప్ తీసుకుని షూటింగ్స్‌లో పాల్గొంటారట.