Shruti Haasan: KGF​2 కంటే సలార్​ 10 రెట్లు కిక్​ ఇస్తుంది!

France: సెన్సేషనల్​ డైరెక్టర్​ ప్రశాంత్​ నీల్(Prashanth Neel)​ రూపొందించిన కేజీఎఫ్​ 2(KGF2) పాన్​ ఇండియా సినిమాగా సరికొత్త రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రశాంత్​ నీల్​, యంగ్​ రెబల్​ స్టార్ ప్రభాస్​(Prabhas)​ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా సలార్(Salaar)​. ఈ సినిమాకోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా, ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది శ్రుతీ హాసన్(Shruti Haasan)​. ఈ సినిమాలో ప్రభాస్​ సరసన శ్రుతి హీరోయిన్​గా నటిస్తోంది. ప్రస్తుతం శ్రుతి ఫ్రాన్స్​లో జరుగుతున్న ప్రతిష్టాత్మక 76వ కాన్స్​ ఫిలిం ఫెస్టివల్​లో పాల్గొంటోంది.

ఈ సందర్భంగా సలార్​ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘ప్రశాంత్ నీల్ ఇంతకుముందు సినిమా చూసే ఉంటారు. హీరో ఉన్నాడు. అతని స్టోరీ ఉంది. కానీ దాని చుట్టూ ఉండేదే ఆ పాత్రను, స్టోరీని నిర్మిస్తుంది. అందులో ప్రతి ఒక్కరికీ తమదైన స్పేస్ ఉంటుంది. ప్రేక్షకుల నాడి పట్టుకునేలా ప్రశాంత్ నీల్.. ఓ కొత్త ప్రపంచాన్ని, పాత్రను క్రియేట్ చేస్తారు. కేజీఎఫ్ 2లో మరిచిపోయిన ఓ తండ్రికి కూడా స్టోరీలో చోటు కల్పించడం నాకు నచ్చింది. ప్రశాంత్ ఇలాంటి ప్రపంచాలను క్రియేట్ చేస్తాడు. అందరికీ కనెక్ట్ అయ్యేలా అతడు క్రియేట్ చేసే ఈ ప్రపంచాలు, పాత్రల వల్లే కేజీఎఫ్ ఇంత పెద్ద సక్సెస్ సాధించిందని అనుకుంటున్నాను. సలార్ లోనూ అలాంటివే ఉన్నాయి. అంతకు 10 రెట్లు మించే ఉంటాయి’ అంటూ చెప్పుకొచ్చింది శ్రుతి.