Tholi Prema: రీరిలీజ్​కి సిద్ధమైన మరో బ్లాక్​బస్టర్!

Hyderabad: ప్రస్తుతం టాలీవుడ్​లో రీరిలీజ్(Re release)​ ట్రెండ్​ జోరుగా కొనసాగుతోంది. స్టార్​ హీరోల పుట్టినరోజు కానుకగా వాళ్ల కెరీర్​లో బ్లాక్​ బస్టర్లుగా నిలిచిన సినిమాలను రీరిలీజ్​ చేస్తూ ఫ్యాన్స్​ని ఖుషీ చేస్తున్నారు మేకర్స్. విశేషం ఏంటంటే.. రీరిలీజ్​ కలెక్షన్లలోనూ రికార్డులు సృష్టిస్తున్నారు హీరోలు. రీరిలీజ్​ సినిమాల్లో ఆల్​టైమ్​ రికార్డులు క్రియేట్​ చేసింది పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్(Pawan Kalyan)​. పవన్​ నటించిన జల్సా(Jalsa), ఖుషి(Kushi) సినిమాలు భారీ కలెక్షన్లతో రికార్డులు సృష్టించాయి.

ఖుషి సినిమా ఏకంగా 7 కోట్ల 80 లక్షలు కలెక్ట్​ చేసి ఆల్​టైమ్​ రికార్డ్​ సెట్​ చేసింది. ఈ రికార్డుని కొల్లగొట్టడానికి చాలా రీ రిలీజ్ లు వచ్చాయి. ఇటీవల విడుదలైన సింహాద్రి(Simhadri) కూడా ఖుషి కలెక్షన్లను అందుకోవడం లో విఫలం అయ్యింది. ఇప్పుడు ఖుషి రికార్డ్స్ ని బద్దలు కొట్టడానికి మరోసారి పవర్​స్టారే స్వయంగా రాబోతున్నారు. ఆయన హీరో గా నటించిన ఎవర్​గ్రీన్ క్లాసిక్ లవ్ స్టోరీ ‘తొలిప్రేమ’(Tholi Prema) చిత్రాన్ని 4K టెక్నాలజీ తో  జూన్ 30న ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చెయనున్నట్లు ప్రకటించారు మేకర్స్​. పవన్​ కల్యాణ్​, కీర్తి రెడ్డి(Keerthi Reddy) జంటగా నటించిన ఈ సినిమాని రీరిలీజ్​ చేయనున్నట్లు శ్రీమాతా క్రియేషన్స్ ట్విటర్​ ద్వారా​ అధికారికంగా ప్రకటించింది.  ఇక, ఈ చిత్రం సంచలన విజయం సాధించి అద్భుతమైన వసూళ్లు సాధించింది. మరి ఈసారి ఎలాంటి రికార్డులు క్రియేట్​ చేస్తుందో చూడాలి.