Teja: ఉద‌య్ కిర‌ణ్ విష‌యంలో అంద‌రిదీ న‌ట‌న‌..!

Hyderabad: ఉద‌య్ కిర‌ణ్ (uday kiran) ఎలా చ‌నిపోయాడో అంద‌రికీ తెలుస‌ని, అంద‌రూ ఎందుకు న‌టిస్తున్నారో తెలీడంలేద‌ని అన్నారు డైరెక్ట‌ర్ తేజ‌ (teja). ఆయ‌న డైరెక్ట చేసిన అహింస మూవీ త్వ‌ర‌లో రిలీజ్ కాబోతోంది. ప్రమోష‌న్స్‌లో భాగంగా ఆయ‌న మ‌రోసారి ఉద‌య్ కిర‌ణ్ (uday kiran) గురించి ప్ర‌స్తావించారు. ఆ మిస్ట‌రీ అందరికీ తెలుసు కానీ తెలియనట్టు ఎందుకు నటిస్తున్నారు అందరు? ఏదో నా చేత చెప్పించాలని అమాయకంగా నటిస్తున్నారు అన్నారు. గ‌తంలో కూడా ఉద‌య్ మృతిపై తేజ సెన్సేష‌న‌ల్ కామెంట్స్ చేసారు. ఎందుకు ఉద‌య్ సూసైడ్ చేసుకోవాల‌నుకున్నాడో త‌న‌కు తెలుస‌ని, తాను చ‌నిపోయేలోపు ఆ విష‌యాల‌న్నీ ఉద‌య్ బ‌యోపిక్‌లో చూపిస్తాన‌ని అన్నారు. తేజ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన నువ్వునేను, చిత్రం, ఔన‌న్నా కాద‌న్నా సినిమాల్లో ఉద‌య్ కిర‌ణ్ న‌టించారు.

ఇక తేజ డైరెక్ట్ చేసిన అహింస (ahimsa) సినిమాలో గీతిక హీరోయిన్‌గా న‌టించారు. ప్ర‌ముఖ న‌టి స‌దా (sadaa) కీ రోల్‌లో కనిపించ‌బోతున్నారు. అభిరామ్ ద‌గ్గుబాటి (abhiram daggubati) న‌టిస్తున్న ఫ‌స్ట్ సినిమా ఇదే. తేజ‌కు ల‌క్కీ చార్మ్ అయిన ఆర్పీ ప‌ట్నాయ‌క్ సినిమాకు మ్యూజిక్ అందించారు. జూన్ 2న సినిమా రిలీజ్ అవ‌బోతోంది. అంతేకాదు.. త్వ‌ర‌లో తేజ రానా ద‌గ్గుబాటితో (rana daggubati) ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. వీరిద్ద‌రూ ఇటీవ‌ల మీట్ అయ్యి కొత్త స్క్రిప్ట్ గురించి డిస్క‌స్ చేసిన‌ట్లు టాక్. త్వ‌ర‌లో తేజ ఈ వివ‌రాలు వెల్ల‌డించ‌నున్నారు.