Adipurush: ప్రీ రిలీజ్​ ఈవెంట్​ ఎక్కడో తెలుసా?

Tirupati: పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​(Prabhas) నటిస్తున్న మైథలాజికల్​ సినిమా ఆదిపురుష్(Adipurush). ఈ సినిమాలో ప్రభాస్​ రాముడిగా కనిపిస్తుండగా, బాలీవుడ్​(Bollywood) బ్యూటీ కృతి సనన్(Kriti sanon) సీతగా కనిపించనుంది. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను బాలీవుడ్​ డైరెక్టర్​ ఓం రౌత్(Om Raut)​ రూపొందించారు. రావణుడిగా బాలీవుడ్​ నటుడు సైఫ్​ అలీఖాన్​(Saif alikhan) నటించారు. ఎన్నో వాయిదాలు, వివాదాల నడుమ తెరకెక్కిన ఈ సినిమా ఎట్టకేలకు జూన్​ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. కాగా చిత్రబృందం ప్రమోషన్స్​ స్పీడు పెంచింది. ఇటీవలే ట్రైలర్​తో పాజిటివ్​ టాక్​ తెచ్చుకున్న సినిమాపై మరిన్ని అంచనాలు క్రియేట్​ చేసేలా ‘జై శ్రీరామ్​’ లిరికల్​ సాంగ్​ను విడుదల చేశారు. ఇక తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్​ ఈవెంట్​కి సంబంధించిన విశేషాలను ప్రకటించారు మేకర్స్​.

ఆదిపురుష్​ ప్రీరిలీజ్​ ఈవెంట్​ను జూన్​ 6న తిరుపతి(Tirupati)లో నిర్వహించనున్నట్లు ప్రకటించారు మేకర్స్​. కాగా, ఈ ఈవెంట్​కి దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా వస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా, ప్రభాస్‌‌ను పాన్ ఇండియా స్టార్‌‌గా నిలబెట్టిన ‘బాహుబలి: ది బిగినింగ్’ ఆడియో లాంచ్ ఈవెంట్ కూడా తిరుపతిలోనే జరిగింది. తిరుపతి ఎస్వీ గ్రౌండ్స్‌లో 2015 జూన్ 13న ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. మళ్లీ ఇప్పుడు ఎనిమిదేళ్ల తరవాత తిరుపతిలో ప్రభాస్ సినిమా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. ఈ సినిమా కూడా సూపర్​ హిట్​ అవ్వాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్​.