Ajith: గిఫ్ట్‌గా 12 ల‌క్ష‌ల విలువైన BMW బైక్!

Chennai: ప్ర‌ముఖ న‌టుడు అజిత్ కుమార్‌కి (ajith) బైకుల‌న్నా, బైక్ రైడింగ్ అన్నా ఎంతో ఇష్టం. అత‌ను (ajith kumar) ఆల్రెడీ ప్రొఫెష‌న‌ల్ బైక్ రైడ‌ర్ కూడా. షూటింగ్స్ లేన‌ప్పుడు త‌న ఫ్రెండ్స్‌తో క‌లిసి బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోతారు. అంతేకాదు.. త‌న‌కు బైక్ రైడింగ్ మీదున్న ప్యాష‌న్‌తో ఓ కంపెనీని కూడా స్టార్ట్ చేసారు. అజిత్‌తో పాటు ఎక్కువ‌గా.. సుగ‌త్ స‌త్ప‌తి (sugat satpati) అనే ట్రావెల‌ర్‌తో క‌లిసి బైక్ డ్రైవ్స్‌కి వెళ్తుంటారు. ఇటీవ‌ల ఆయ‌న సుగ‌త్‌తో క‌లిసి నేపాల్, భూటాన్ వెళ్లి వ‌చ్చారు. సుగ‌త్ ఇప్ప‌టికే రెండుసార్లు అజిత్ కోసం బైక్ రైడింగ్ టూర్స్ ఏర్పాటుచేసార‌ట‌. ఈ సందర్భంగా అజిత్ ఆయ‌న‌కు ఓ స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. ఏకంగా రూ.12 ల‌క్ష‌లు విలువైన BMW బైక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ విష‌యాన్ని సుగ‌త్ సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు.

“2022 డిసెంబ‌ర్‌లో నేను ల‌క్కీ ఫెల్లోని అయిపోయాను. ఎందుకంటే త‌మిళ సూప‌ర్‌స్టార్ అజిత్ న‌న్ను క‌లిసి బైక్ రైడ్ ట్రిప్స్ ప్లాన్ చేయాల‌ని చెప్పారు. ఆయ‌న కోసం నేను రెండు ట్రిప్స్ వేసాను. ఆయ‌న‌కు కూడా బైకుల‌న్నా, బైక్ రైడ్స్ అన్నా ఎంతో ఇష్ట‌మ‌ని తెలిసి హ్యాపీగా ఫీల‌య్యా. ఆయ‌న‌తో నేను ట్రిప్స్‌కి వెళ్లిన‌ప్పుడు నా ద‌గ్గ‌రున్న పాత డ్యూక్ 390 వేసుకెళ్లేవాడిని. దాంతో నాకు అజిత్ అన్న ఈ సూప‌ర్ బైక్ గిఫ్ట్‌గా ఇచ్చారు. నిజంగా నేను చాలా ల‌క్కీ. థ్యాంక్స్ అజిత్ అన్నా” అని పోస్ట్ చేసారు.