Priyanka Chopra: నన్ను అండర్వేర్లో చూడాలన్నాడు!
Mumbai: బాలీవుడ్(Bollywood)లో స్టార్ హీరోయిన్గా రాణించిన ప్రియాంకా చోప్రా(Priyanka Chopra) ప్రస్తుతం హాలీవుడ్(Hollywood)లో రాణిస్తూ గ్లోబల్ స్టార్‌గా మారిపోయింది. హాలీవుడ్ సింగర్, యాక్టర్ నిక్జోనాస్ని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయిన ప్రియాంక పూర్తిగా బాలీవుడ్‌కి దూరమైంది. ప్రియాంక బాలీవుడ్‌కి దూరమవడంపై చాలా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇటీవలే కంగనా రనౌత్ కూడా ప్రియాంకని ఉద్దేశపూర్వకంగానే బాలీవుడ్ నుంచి పంపించేశారని కామెంట్స్ చేసింది. కాగా, తాజాగా ప్రియాంక ఓ డైరెక్టర్ తనపట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు చెప్పుకొచ్చింది.
‘కెరీర్ ఆరంభంలో నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఓ బాలీవుడ్ డైరెక్టర్ నన్ను అండర్వేర్లో చూడాలి అన్నాడు. సినిమా షూటింగ్ జరుగుతోంది. అక్కడే నన్ను లోదుస్తులు కనపడేలా బట్టలు తీసేయమన్నాడు. లేకపోతే ఈ సినిమా ఎవరు చూస్తారు అంటూ తన అసిస్టెంట్‌కి చెప్పాడు. అందుకు నేను ఒప్పుకోలేదు. ఆ సినిమా నుంచి తప్పుకున్నా. అతన్ని ఏమీ అనలేకపోయా. భయంతో ఆరోజు మాట్లాడకపోవడం నేను చేసిన తప్పు. నేను అన్ని విషయాలను బాహాటంగా పంచుకోలేను. అదే నాకున్న అతిపెద్ద సమస్య’ అంటూ కెరీర్ ఆరంభంలో తను ఎదుర్కొన్న పరిస్థితులను చెప్పుకొచ్చింది ప్రియాంక.
సినీపరిశ్రమలో హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్లలో తేడా గురించి కూడా ప్రియాంక పలు సందర్భాల్లో ఓపెన్‌గానే కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ప్రియాంక సిటాడెల్(Citadel) అనే అమెరికన్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సిరీస్‌లో ప్రియాంక నటనకు ప్రముఖుల నుంచీ ప్రశంసలు అందుతున్నాయి.