Sukanya Samriddhi Yojana: ఇన్వెస్ట్ చేస్తున్నారా… ఇవి గ‌మ‌నించుకోండి!

Hyderabad: ఆడ‌పిల్ల‌ల భ‌విష్య‌త్తు కోసం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (pm modi) ప్రవేశ‌పెట్టిన ఓ చ‌క్క‌టి స్కీం సుఖ‌న్య స‌మృద్ధి యోజ‌న‌ (sukanya samriddhi yojana). మీ కూతుళ్ల కోసం ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డి పెట్టాల‌నుకుంటున్నారా? నిపుణులు ఏం చెప్తున్నారో చూడండి.

సుఖ‌న్య స‌మృద్ధి యోజ‌న ప్ర‌స్తుత‌ వ‌డ్డీ రేటు 8 శాతం ఉంది. మూడు నెల‌ల‌కోసారి ఈ వడ్డీ రేట్లు మారుతుంటాయి. కానీ ఆడ‌పిల్ల భ‌విష్య‌త్తుకు సంబంధించిన‌ది కాబ‌ట్టి ఈ వ‌డ్డీ రేటు ద్రవ్యోల్బ‌ణాన్ని త‌ట్టుకుంటాయ‌ని చెప్ప‌డం క‌ష్ట‌మేన‌ని అంటున్నారు SAG ఇన్ఫోటెక్ ఎండీ అమిత్ గుప్తా. మ్యుచువ‌ల్ ఫండ్స్‌తో పోలిస్తే.. ఈ స్కీం నుంచి వ‌చ్చే రిట‌ర్న్స్ చాలా త‌క్కువ‌ని అంటున్నారు. ఇకపోతే సుఖన్య స‌మృద్ధి యోజ‌న టెన్యూర్ 21 ఏళ్లు. అంత‌దాకా వెయిట్ చేసే ప‌నిలేకుండా లాంగ్ ట‌ర్మ్ రిట‌ర్న్స్ బాగా రావాలంటే ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్ బెస్ట్ అని అంటున్నారు అమిత్ గుప్తా. అదీకాకుండా ఈ స‌మృద్ధి యోజ‌న స్కీంలో ఉన్న కొన్ని ప‌రిమితుల వ‌ల్ల‌ ఇన్వెస్ట్ చెయ్య‌డానికి ఇబ్బందులు ఉన్నాయి. ఈ స్కీంలో సేవ్ చేసే డ‌బ్బు అంతా ఆడ‌పిల్ల చ‌దువు, పెళ్లి కోసం మాత్ర‌మే ఉప‌యోగించాలి.

ఈ స్కీం లాకిన్ పీరియడ్ కూడా చాలా ఎక్కువ‌. అకౌంట్ తెరిచిన‌ప్ప‌టి నుంచి 21 ఏళ్ల వ‌ర‌కు ఇన్వెస్ట్ చేస్తూ వెయిట్ చేయాలి. ఆడ‌పిల్ల‌కు 18 ఏళ్లు వ‌చ్చాక ఉన్నత చ‌దువుల కోసం డ‌బ్బు తీయాల‌నుకుంటే 50% మాత్ర‌మే వాడుకోవాలి. అకౌంట్ టెన్యూర్ 21 ఏళ్లు అయిన‌ప్ప‌టికీ మొద‌టి 15 ఏళ్లు మాత్ర‌మే డ‌బ్బు డిపాజిట్ చేస్తూ ఉండాలి. కాబ‌ట్టి ఈ ద్ర‌వ్యోల్బ‌ణాన్ని త‌ట్టుకుని ఆడ‌పిల్ల‌కు మంచి భ‌విష్య‌త్తు ఇవ్వాలంటే.. ఈ స్కీంతో పాటు కొన్ని ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా చేయాల‌ని నిపుణులు చెప్తున్నారు.

ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్ర‌మే. ఆర్థిక నిర్ణ‌యాలు తీసుకునే ముందు బాగా రీసెర్చ్ చేసి నిపుణుల స‌ల‌హాలు తీసుకోవాలి.