Bichagadu 3: సీక్వెల్​​ కన్ఫామ్.. డైరెక్టర్​ ఎవరో తెలుసా!

Chennai: కోలీవుడ్​ మల్టీటాలెంటెడ్​ హీరో విజయ్​ ఆంటోనీ(Vijay Antony) తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్నారు. బిచ్చగాడు(Bichagadu), బిచ్చగాడు2(Bichagadu) సక్సెస్​తో విజయ్​ ఫుల్​ఫామ్​లో ఉన్నారు. అదే జోష్​లో బిచ్చగాడు 3(Bichagadu3) కూడా ప్రకటించేశారు. అంతేకాదు ఈ సినిమాకీ తనే దర్శకత్వం వహిస్తానని చెప్పారు.

విజయ్ ఆంటోనీ, కావ్య థాపర్​(Kavya Thapar) జంటగా నటించిన బిచ్చగాడు 2 ఇటీవలే విడుదలై హిట్​ టాక్​తో దూసుకుపోతోంది. 2016లో వచ్చిన బిచ్చగాడు సినిమాకి ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. బిచ్చగాడు 100రోజులు ఆడిన డబ్బింగ్ సినిమాగా టాలీవుడ్ లో రికార్డుని క్రియేట్ చేసింది. బిచ్చగాడు 2 కూడా తెలుగు రాష్ట్రాల్లో సూపర్​ ఓపెనింగ్స్​ అందుకుంది. మొదటి రోజు వచ్చిన తమిళ కలెక్షన్స్ కంటే రెండు తెలుగు రాష్ట్రాల ఫస్ట్ డే కలెక్షన్స్ ఎక్కువ.

ఇక ఈ సీక్వెల్ కూడా భారీ విజయాన్ని అందుకోవడంతో.. బిచ్చగాడుకి మూడో భాగం కూడా తీస్తాను అని ప్రకటించారు విజయ్ ఆంటోనీ. ప్రస్తుతం బిచ్చగాడు 2 సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఉన్న విజయ్ ఆంటోనీ.. బిచ్చగాడు 3ని కన్ఫామ్​ చేశారు. 2025లో బిచ్చగాడు 3 ని సెట్స్ పైకి తీసుకు వెళ్తాను అంటూ చెప్పుకొచ్చారు. విశేషం ఏంటంటే.. ఆ సినిమాని కూడా విజయ్ ఆంటోనీనే డైరెక్ట్ చేస్తాను అని ప్రకటించారు. మొదటి భాగం డైరెక్టర్​ శశి రూపొందించగా, బిచ్చగాడు 2 విజయ్​ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో దర్శకుడిగానూ విజయ్​ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.