Avinash Reddy: దయచేసి అమ్మ ప్రేమను అర్థంచేసుకోండి!
Kurnool: దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి (viveka case) హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డిని (avinash reddy) సీబీఐ ఎలాగైనా అరెస్ట్ చేయాలని చూస్తోంది. ఇప్పటికే ఐదారు సార్లు విచారణకు రావాలని తెలంగాణ సీబీఐ అధికారులు.. అవినాష్‌కు నోటీసులు పంపారు. కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా అవినాష్ విచారణకు హాజరైనది లేదు. మొన్న ఆదివారం నాడు కూడా సీబీఐ నోటీసులు పంపింది. కానీ తన తల్లికి గుండెపోటు వచ్చిందని.. కర్నూలులో విశ్వభారతి హాస్పిటల్లో చికిత్స పొందుతోందని చెప్పి తప్పించుకున్నారు. దాంతో సీబీఐ అవినాష్‌ను అరెస్ట్ చేయాలని కర్నూలుకు చేరుకుంది. కర్నూలు ఎస్పీ సాయంతో అవినాష్‌ను హైదరాబాద్‌కు తరలించాలని అధికారులు ఎంతో కృషి చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో హాస్పిటల్ ముందు వైసీపీ (ycp) కార్యకర్తులు అంటించిన ఓ బ్యానర్ వైరల్ అవుతోంది. “దయచేసి అమ్మ ప్రేమను అర్థం చేసుకోండి. మానవత్వంలో ఆలోచించండి.. సీబీఐ అధికారులారా” అని తెలుగు, ఇంగ్లీష్‌లో రాసిన బ్యానర్‌ను హాస్పిటల్ ముందు కట్టారు. మరోపక్క కర్నూల్ ఎస్పీ కూడా వైసీపీకే (ycp) మద్దతు ఇస్తూ సీబీఐకి (cbi) సహకరించడంలేదని తెలుస్తోంది. దాంతో అవినాష్‌ను (avinash reddy) ఎలా విచారించాలన్న దానిపై ఇప్పుడు చర్చ మొదలైంది. మరోపక్క ముందస్తు బెయిల్ (anticipatory bail) కోసం అవినాష్ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండాపోయింది.