BRO: అల్లుడి లుక్ అదుర్స్..!

Hyderabad: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌(pawan kalyan).. త‌న మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌తో (sai dharam tej) ఫ‌స్ట్ టైం స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు(bro). ప్ర‌ముఖ త‌మిళ డైరెక్ట‌ర్ స‌ముద్ర‌ఖ‌ని(samuthirakani) ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఇప్ప‌టికే సినిమా టైటిల్‌ను, ప‌వ‌న్ క‌ళ్యాణ్ లుక్‌తో ఉన్న టీజ‌ర్‌ను రిలీజ్ చేసి హైప్ పెంచేసారు. ఇప్పుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ అయింది. ఈ సినిమాలో ధ‌ర‌మ్ తేజ్ మార్క్ అలియాస్ మార్కండేయులు (markandeyulu) అనే క్యారెక్ట‌ర్లో న‌టిస్తున్నారు. త‌మిళంలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన వినోద‌య సీతంకు (vinodaya seetam) ఈ సినిమా రీమేక్‌గా రాబోతోంది. ఇక‌పోతే ఈ సినిమాలో ప‌వ‌న్ మ‌రోసారి దేవుడి అవ‌తారంలో కనిపించ‌బోతున్నార‌ని టీజ‌ర్‌ను బ‌ట్టి అర్థం అవుతోంది. ఆల్రెడీ గోపాల గోపాల‌లో ఆయ‌న కృష్ణుడి పాత్ర‌తో అద‌ర‌గొట్టేసారు. ఇక ఇందులో ఎలాంటి దేవుడి గెట‌ప్‌లో క‌నిపించ‌బోతున్నారో చూడాలి. ఓ వ్య‌క్తి చ‌నిపోయాక‌.. దేవుడు అత‌నికి రెండో ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్‌తో సినిమా తీస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇక హీరోయిన్లుగా కేతికా శ‌ర్మ(ketika sharma), ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్లు(priya prakash warrior) న‌టిస్తున్న‌ట్లు టాక్.