Oscar ప్రెజెంటర్‌గా దీపిక.. అవార్డు “నాటు నాటు”కేనా?
దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమాకు గ్లోబల్ గుర్తింపు దక్కేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్న నాటు నాటు పాటకు ఆ ఆస్కార్ కాస్తా వచ్చేస్తే మన తెలుగువారితో పాటు యావత్ భారత్ పండగ చేసుకుంటుంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్‌కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే అవార్డు వస్తుందా రాదా అనేది మాత్రం ఎవరూ చెప్పలేరు. అయితే నాటు నాటు పాటకు కచ్చితంగా అస్కార్ వచ్చే తీరుతుంది అంటూ నెట్టింగ్ టాక్ వినిపిస్తోంది.
ఇందుకు కారణం లేకపోలేదు. ఈ నెల 12న అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ వేడుక అట్టహాసంగా జరగనుంది. ఈ వేడుకలో అవార్డు ప్రెజెంటర్ల పేరును ఆస్కార్ అకాడెమీ ప్రకటించింది. లిస్ట్‌లో బాలీవుడ్ బ్యూటీ దీపిక పడుకొణె ఉండటం విశేషం. దాంతో మన భారతీయ సినిమా అయిన ఆర్ ఆర్ ఆర్‌లోని నాటు నాటు పాట నామినేట్ అవడంతో.. భారతీయ నటే అవార్డు ఇస్తే బాగుంటుందని దీపికను లిస్ట్‌లో యాడ్ చేసి ఉంటారని నెటిజన్లు భావిస్తున్నారు. అదే నిజమైతే… ఓ భారతీయుడికి అంతకంటే ఏం కావాలి.
మరోపక్క ఆస్కార్ స్టేజ్‌పై నాటు నాటు పాటకు సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ డ్యాన్స్ వేసి ప్రదర్శన ఇవ్వబోతున్నారు. అంతేకాదు ఈ పాటకు రామ్ చరణ్ కూడా స్టెప్పులు వేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. నాటు నాటు పాటకు అవార్డు ఇవ్వడానికే దీపికను ప్రెజెంటర్‌గా ఎంపికచేసి ఉంటారు అని ఫిక్స్ అవడంతో పాటు అవార్డు అందించేటప్పుడు దీపిక ఎలాంటి దుస్తులు వేసుకోవాలో కూడా ఫ్యాన్సే సలహాలు ఇచ్చేస్తున్నారు. తొలిసారి భారతీయ పాటకు ఈ గౌరవం దక్కుతున్నందుకు మంచి చీర కట్టుకుని వెళ్లు దీపిక అంటూ కామెంట్లు పెడుతున్నారు. RRRతో పాటు మన భారత్ నుంచి ఎలిఫాంట్ విస్పరర్స్, ఆల్ ది బ్రీత్స్ అనే సినిమాలు కూడా ఆస్కార్‌కు నామినేట్ అయ్యాయి. కాబట్టి నాటు నాటుకి అవార్డు ఇవ్వడానికే దీపిను ప్రెజెంటర్‌గా లిస్ట్‌లో చేర్చి ఉంటారని అనుకోవడం సరికాదు అంటూ మరికొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.