Dimple Hayathi: అధికారంతో తప్పులను దాచలేరు!
Hyderabad: రామబాణం(Ramabanam) సినిమా హీరోయిన్ డింపుల్ హయాతీ(Dimple Hayathi) వివాదంలో చిక్కుకుంది. ఓ ఐపీఎస్ ఆఫీసర్‌తో గొడవపడి అతని కారును ఢీ కొట్టిన డింపుల్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. జూబ్లీ హిల్స్ హుడా ఎన్‌క్లేవ్‌లో ఎస్కేఆర్ అపార్ట్‌మెంట్స్‌లో డింపుల్ హయాతి తన స్నేహితుడు విక్టర్ డేవిడ్‌తో కలిసి ఉంటోంది. అదే అపార్ట్మెంట్లో ఉండే ఓ ఐపీఎస్ కారును ఉద్దేశపూర్వకంగా ఢీ కొట్టి, కాలుతో తన్నడంతో ఆయన జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు డింపుల్ హయాతి, ఆమె ఫ్రెండ్‌పై క్రిమినల్ కేసుని నమోదు చేశారు. ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారడంతో తాజాగా దీనిపై డింపుల్ తన ట్విట్టర్ ద్వారా స్పందించింది.
‘అధికారాన్ని ఉపయోగించి ఏ తప్పుని ఆపలేరు, అధికారాన్ని దుర్వినియోగం చేసి తప్పులని దాచలేరు.. సత్యమేవ జయతే’ అని నవ్వుతూ ఉండే సింబల్స్ పెట్టి ట్వీట్ చేసింది డింపుల్. దీంతో ఈ విషయంలో తన తప్పేమి లేదు, వాళ్ళ చేతిలో పోలీస్ పవర్ ఉంది కాబట్టే ఇలా చేస్తున్నారు అని అర్ధం వచ్చేలా ట్వీట్స్ చేసింది డింపుల్. దీంతో డింపుల్ హయతి చేసిన ట్వీట్స్ వైరల్ గా మారాయి.