G20 సదస్సుకు ఉగ్రముప్పు.. అయినా కశ్మీర్‌లోనే!

Srinagar: G-20 టూరిజం సదస్సు జమ్మూకశ్మీర్‌లో(jammu kashmir) ప్రారంభమైంది. అయితే.. ఈ సదస్సు జరగకుండా… ముంబైలో గతంలో జరిపిన దాడుల మాదిరిగా.. ఉగ్రకుట్రకు కొన్ని సంస్థలు పూనుకున్నాయి. ఈ విషయాన్ని భారత ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ గుర్తించింది. కేంద్ర బలగాలను జమ్మూలో అడుగడుగునా మోహరించాయి. ఈక్రమంలో ఎక్కడైతే.. జీ20 సదస్సు నిర్వహిస్తున్నారో ఆ హోటల్‌లో పనిచేసే వ్యక్తి… ఉగ్ర సంస్థలకు సమాచారం చేరవేస్తున్నాడని తెలుసుకుని అతన్ని అరెస్టు చేశారు. ఒకవేళ అతన్ని అరెస్టు చేయకుంటే చాల నష్టం వాటిల్లేది. ఇక మరోవైపు జీ20 సదస్సుకు చైనా హాజరు కానని పేర్కొంది. వివాదాస్పదమైన కశ్మీర్‌లో కార్యక్రమం ఏర్పాటు చేయడం తమకు నచ్చలేదని పేర్కొంది. కానీ చైనా మాత్రం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో చైనా-పాక్‌ ఎకనామిక్‌ కారిడార్‌ను నిర్మించి పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ నిర్మించారు. భారత్‌ విషయానికి వచ్చే సరికి చైనా కపటబుద్ది ఈ విషయంలో స్పష్టమైంది. పాక్‌కు మద్దతు ఇస్తున్న ధోరణి చైనా నేతల తీరుబట్టి తెలిసిపోతోంది.

జమ్మూకశ్మీర్ లోనే టూరిజం సదస్సు నిర్వహించడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. భారతదేశంలోనే టూరిజం హబ్‌గా జమ్మూకశ్మీర్ ఉంది. దీన్ని ప్రమోట్‌ చేసే పనిలో భాగంగా అదేవిధంగా విదేశీయుల పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంటుంది. రెండోది ఈ ప్రాంతం వివాదాస్పద ప్రాంతంగా ఉంది. ఆర్టికల్‌ 370 తర్వాత.. జమ్మూకశ్మీర్‌ భారతదేశంలో అంతర్భాగం అని ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం ఉంది. దీంతో ఒక సందేశం పంపాలని భారత్‌ చూస్తోంది. ఇక గ్లోబల్‌ ఎటెన్షన్‌ కోసం ఎదురుచూసే తీవ్రవాదలు.. జీ 20 సదస్సును భగ్నం చేస్తామని ముందు నుంచే సంకేతాలు పంపుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది.