SSMB28: మహేష్​ సినిమాలో బాలీవుడ్​ స్టార్​ హీరో!

Hyderabad: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram)​ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. SSMB28 వర్కింగ్​ టైటిల్​తో రూపొందుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే(Pooja Hegde), శ్రీలీల(Sreeleela) హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13 విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్​ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా టైటిల్​ కోసం మహేష్​ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మే 31న సూపర్​స్టార్​ కృష్ణ జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్​ ప్రకటిస్తారని తెలుస్తోంది. కాగా, ఈ సినిమాకు సంబంధించి మరో వార్త చక్కర్లు కొడుతోంది.

అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్​, త్రివిక్రమ్​ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా కావడంతో భారీ అంచనాలే ఉన్నాయి. అందుకే ఈ సినిమాని ప్రేక్షకుల అంచనాలకు మించి రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు త్రివిక్రమ్​. ఇందులో భాగంగానే ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో నటించేందుకు బాలీవుడ్(Bollywood)​ స్టార్​ హీరో అక్షయ్​ కుమార్​(Akshay Kumar)ను సంప్రదించారట. అక్షయ్​ కూడా ఒప్పుకున్నారని తెలుస్తోంది. పాన్​ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ మూవీలో అక్షయ్ కుమార్ ఏ పాత్రలో కనిపించనున్నాడో వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. హారిక & హాసిని క్రియేషన్స్ భారీ బడ్జెట్​తో ఈ సినిమాను నిర్మిస్తోంది.