పార్టీ కావాలని అడిగిన రష్మిక.. విజయ్ రియాక్షన్ ఇదే
Rashmika Mandanna: పార్టీ కావాలి అంటూ రష్మిక మందన.. విజయ్ దేవరకొండను (Vijay Devarakonda) ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసారు. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ నటించిన ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా రష్మిక వారికి విషెస్ తెలిపారు. నా డార్లింగ్స్ విజయ్ దేవరకొండ, పరశురామ్‌కు ఆల్ ది బెస్ట్. ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ రిలీజ్ కాబోతోంది. నాకు తెలిసి ఇది ఆల్రెడీ హిట్ అయిపోయింది. పార్టీ కావాలి అని ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనికి విజయ్ స్పందిస్తూ.. క్యూటెస్ట్ అని అన్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ నిన్న రిలీజ్ చేసారు. చూడబోతే ఈసారి విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేలాగే ఉన్నాడని చాలా మంది అభిప్రాయపడ్డారు. ట్రైలర్ మాత్రం చాలా బాగుందని ఇక సినిమా కూడా ఇదే స్థాయిలో ఉంటే మళ్లీ విజయ్ ట్రాక్‌లోకి వచ్చినట్లే అని అంటున్నారు.