Trisha: 40ల్లో త్రిష షాకింగ్ రెమ్యున‌రేష‌న్..!

Trisha: ఎవ‌ర్‌గ్రీన్ బ్యూటీ త్రిష‌కు 40ల్లో కూడా సినిమా ఆఫ‌ర్ల‌కు ఏమాత్రం కొద‌వ లేదు. ఒక‌ప్పుడు న‌టించిన స్టార్ హీరోల‌తోనే మ‌ళ్లీ వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నారు. లియో (Leo) సినిమాలో విజ‌య్‌తో (Vijay) న‌టించిన త్రిష ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో (Chiranjeevi) జ‌త‌క‌ట్టారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో విశ్వంభ‌ర (Vishwambhara) సినిమా వ‌స్తోంది.

దీంతో పాటు త్రిష చేతిలో మ‌రో ఐదు సినిమాలు ఉన్నాయి. అందులో క‌మ‌ల్ హాస‌న్ (Kamal Haasan) థ‌గ్ లైఫ్ (Thug Life) కూడా ఒక‌టి. ఈ సినిమాకు గానూ త్రిష ఏకంగా రూ.12 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకున్నార‌ట‌. ఇందుకు కార‌ణం ఆమె న‌టించిన పొన్నియిన్ సెల్వ‌న్ (Ponniyin Selvan) సినిమా రూ.800 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టడం. లియో సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డం. దాంతో ఇప్పుడు ద‌క్షిణాది ప‌రిశ్ర‌మ‌లో అత్య‌ధిక పారితోషికం తీసుకుంటున్న ఏకైక న‌టిగా త్రిష నిలిచారు. త్రిష చేతిలో విడా ముయ‌ర్చి, ఐడెంటిటీ సినిమాలు ఉన్నాయి.

ALSO READ: Vishwambhara: డూప్ లేకుండా..!