హ్యాట్రిక్ కోసం బాల‌య్య కీల‌క నిర్ణ‌యం

Balakrishna: తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) స్థాపించిన‌ప్ప‌టి నుంచి హిందూపూర్ (Hindupur) నియోజ‌క‌వ‌ర్గం కంచుకోట‌లా మారిపోయింది. ఈ నియోజ‌క‌వర్గం నుంచి నంద‌మూరి బాల‌కృష్ణ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ ప్రాంతంలో బాల‌య్య‌ను కొట్టే మొన‌గాడే లేడ‌ని నిరూపించుకున్నారు. అయితే ఈ సారి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎలాగైనా బాల‌య్య‌కు హ్యాట్రిక్ ద‌క్క‌నివ్వ‌కుండా YSRCP తెగ ప్లాన్లు వేస్తోంది.

దాంతో ఈసారి కూడా గెలుపును మిస్ అవ్వ‌ద్దు అని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయిన బాల‌య్య ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఎలాంటి క‌థ‌ల‌ను విన‌డానికి కానీ షూటింగ్స్‌లో పాల్గొన‌డానికి కానీ ఒప్పుకోవ‌డంలేదు. ఎక్కువ శాతం హిందూపూర్‌లోనే ఉంటున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆయ‌న బాబీ డైరెక్ష‌న్‌లో ఓ సినిమాలో న‌టిస్తున్నారు. అయితే.. ప్ర‌చారం అయ్యేంత‌వ‌ర‌కు షూటింగ్ సెట్‌లోకి అడుగుపెట్ట‌కూడ‌ద‌ని బాల‌య్య నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం.

ఈసారి YSRCP నుంచి హిందూపూర్‌లో తిప్పేగౌడ నారాయ‌ణ దీపిక పోటీ చేయ‌నున్నారు. దీపిక ఈసారి బాల‌య్య‌కు గ‌ట్టి పోటీనే ఇచ్చేలా ఉన్నారని విశ్వ‌సనీయ వ‌ర్గాల సమాచారం.