Mudragada కు అవ‌మానం.. జ‌గ‌న్ ఏమ‌న్నారు?

Mudragada: కాపు సంఘం అధినేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభానికి ఘోర అవ‌మానం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ముందు జ‌న‌సేన‌లో (Janasena) చేరాల‌నుకుని ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు (Pawan Kalyan) తెగ స‌ల‌హాలు ఇచ్చిన ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం చివ‌రికి YSRCPలో చేరాల‌నుకున్నారు. ఈరోజు ఆయ‌న, ఆయ‌న కుమారుడు గిరి YSRCP కండువా క‌ప్పుకోవాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో తాడేప‌ల్లిగూడెంలోని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (Jagan Mohan Reddy) నివాసంలో ఆయ‌న‌కు అవ‌మానం జ‌రిగిన‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

తాడేప‌ల్లిగూడెంలోని జ‌గ‌న్ ఇంటికి దాదాపు 10,000 కార్ల‌తో భారీ ర్యాలీగా వెళ్లాల‌నుకున్నారు. కానీ అంత మందితో వెళ్తే జ‌గ‌న్‌కు సెక్యూరిటీ స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని పార్టీ హైక‌మాండ్ చీవాట్లు పెట్టింద‌ట‌. దాంతో భారీ ర్యాలీ ఏర్పాట్ల‌ను ముద్ర‌గ‌డ ర‌ద్దు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. దాంతో ఈరోజు పార్టీలో చేరాల్సిన కార్య‌క్ర‌మాన్ని ఈ నెల 15 లేదా 16కు వాయిదా వేసుకున్నారు.

READ ALSO: KA Paul: ముద్ర‌గ‌డ గారూ.. అడుక్కు తినండి

ఓ ర‌కంగా చెప్పాలంటే ముద్ర‌గ‌డ బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌ను జ‌గ‌న్ కేడ‌ర్ నిరాక‌రించిన‌ట్లే. ఒకానొక స‌మ‌యంలో అమ‌రావ‌తిలో జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ కోసం ముద్ర‌గ‌డ రోజులు త‌ర‌బ‌డి నిరీక్షించారు.ఆ త‌ర్వాత అవ‌మానంతో వ‌చ్చేసారు. మ‌ళ్లీ ఇప్పుడు భ‌ద్ర‌తా స‌మస్య సాకుతో ముద్ర‌గ‌డ‌తో మ‌రోసారి జ‌గ‌న్ అవ‌మానించార‌ని ఆయ‌న అనుచ‌రుల నుంచి గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

అయితే దీనిని అవ‌మానంగా అని భావించ‌కుండా.. ముద్ర‌గ‌డ త‌న శైలిలో చ‌క్క‌టి క‌వ‌ర్ డ్రైవ్ ఇచ్చారు. ప‌ది వేల మంది కార్ల‌లో భారీ ర్యాలీగా తన వెంట రావాల‌ని చెప్పిన ముద్ర‌గ‌డ‌.. ఆ త‌ర్వాత మాట మార్చి.. ప‌ది వేల కంటే ఎక్కువ మంది నుంచి స్పంద‌న రావ‌డంతో భ‌ద్ర‌తా ప‌ర‌మైన స‌మ‌స్య‌లు వ‌స్తాయని ఒంట‌రిగా వెళ్తున్న‌ట్లు మ‌రో లేఖ‌ను విడుద‌ల చేసారు ముద్ర‌గ‌డ‌. (Mudragada)