Vijaya Sai Reddy: నేను బ‌తికున్నంత వ‌ర‌కు కాంగ్రెస్ అధికారంలోకి రాదు

Vijaya Sai Reddy: మ‌రో రెండు త‌రాల వ‌ర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశ‌మే లేద‌ని అన్నారు YSRCP ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి. తాను బ‌తికున్నంత వ‌ర‌కు కానీ.. త‌న పిల్ల‌లు బ‌తికున్నంత వ‌ర‌కు కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాద‌ని.. ఎందుకంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు ఇష్టం లేకుండానే ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న చేసార‌ని.. దాని వ‌ల్ల ఏపీ ప్రజ‌లు ప‌డిన క‌ష్టాలు, ఎదుర్కొన్న న‌ష్టాలు వారు ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేర‌ని పేర్కొన్నారు.

తెలుగు దేశం, జ‌న‌సేన, భార‌తీయ జ‌న‌తా పార్టీ పొత్తులు పెట్టుకుని ఒకేసారి వ‌చ్చినా కూడా జ‌రగ‌బోయే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ గెలిచేది తామేన‌ని స్ప‌ష్టం చేసారు. ఓట్ల బ‌దిలీ అనేది జ‌రిగే ప‌ని కాద‌ని.. ఎంత జ‌రిగినా కూడా మూడు పార్టీల ఓట్ల శాతం మొత్తం క‌లిపితే 46 శాతం మాత్ర‌మే ఉంద‌ని.. కానీ వైసీపీకి 50% ఉంద‌ని తెలిపారు. ఇక ఏపీ రాజ‌ధానుల విష‌యానికొస్తే.. విజ‌య‌వాడ శాస‌న‌మండలి రాజ‌ధానిగా ఉండబోతోంద‌ని.. విశాఖ‌ప‌ట్నం కార్య‌నిర్వాహ‌క రాజ‌ధానిగా ఉండ‌బోతోంద‌ని స్ప‌ష్టం చేసారు. ఇందులో ఏమాత్రం మార్పు లేద‌ని పేర్కొన్నారు.