AP Elections: ప్రత్యేక హోదా పరిస్థితేంటి? ఎవరు తెస్తారు?
AP Elections: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు టాపిక్ అంతా ప్రత్యేక హోదా (Special Status for AP) పైనే ఉంది. ఆంధ్ర ప్రదేశ్ విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకహోదా కోసం మహోద్యమమే జరుగుతోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. అయితే.. అసలు ప్రత్యేక హోదా అంటే ఏమిటి, దీన్ని పొందడానికి రాష్ట్రాలలో ఉండవలసిన పరిస్థితులు ఏమిటి. దేశంలో హోదా ఉన్న రాష్ట్రాలు పొందుతున్న ప్రత్యేక లాభాలు, సదుపాయాలు ఏంటి?
ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో తెలుగు దేశం (Telugu Desam Party), జనసేన (Janasena), భారతీయ జనసేన పార్టీలు (Bharatiya Janata Party) ఒక్కటవడంతో రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్, భారతీయ జనసేన పార్టీలు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అదీకాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) నిన్న చివరి సిద్ధం సభలో భాగంగా ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించారు. 14 ఏళ్లు అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. భారతీయ జనాత పార్టీతో కలిసి ఉన్నప్పటికీ ప్రత్యేక హోదాకు ఎందుకు తీసుకురాలేకపోయారు అని ప్రశ్నించారు.
మరి జగన్ ఏం చేసారు?
నిన్న సిద్ధం సభలో ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించిన జగన్.. ఈ నాలుగున్నరేళ్ల పాలనలో ప్రత్యేక హోదా గురించి ఏం చేసారు? కేంద్ర ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు జరిపారు? ఈ విషయం గురించి మాత్రం జగన్ ప్రస్తావించకపోవడం గమనార్హం. ఎంత సేపూ.. రెండు రాజధానులు.. తదుపరి ప్రమాణ స్వీకారం విశాఖలో అని అనడమే తప్ప ప్రత్యేక హోదా గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదు. ఇప్పుడు మూడు పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయన్న భయంతోనో లేక అసూయతోనో ఆయన ప్రత్యేక హోదా తెచ్చారా అని ప్రశ్నించారు.
ALSO READ: నేను బతికున్నంత వరకు కాంగ్రెస్ అధికారంలోకి రాదు
రాష్ట్ర విభజన జరిగాక నష్టపోయిన రాష్ట్రం ఏదన్నా ఉందంటే అది ఆంధ్రప్రదేశే. రాజధాని లేకుండాపోయింది… ఆర్ధికంగా చితికిపోయింది. అందుకే ప్రత్యేక హోదా కోసం ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తోంది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇందుకు ఒప్పుకోవడం లేదు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరం ఏముందని ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో చేసిన కామెంట్ చాలా మందిని షాక్‌కు గురిచేసింది.
ప్రత్యేక హోదాను ఇప్పుడు ఎవరు తెస్తారు?
ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి అది చేస్తాం ఇది చేస్తాం అని పార్టీల అధినేతలు తెగ హామీలు ఇస్తున్నారు. కానీ ప్రత్యేక హోదా గురించి మాత్రం ఎవ్వరూ మాట్లాడటంలేదు. ఇక ఇప్పుడు మాట్లాడినా ప్రయోజనం లేదు. ఎందుకంటే ప్రత్యేక హోదాను ప్రకటించాల్సింది కేంద్ర ప్రభుత్వమే. అలాంటి కేంద్ర ప్రభుత్వమే ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు అయిన తెలుగు దేశం, జనసేనలతో పొత్తు పెట్టుకుంది. అతి కష్టం మీద వారిని పొత్తు పెట్టుకోవాలని ఒప్పించారు. ఇక ఇప్పుడు కానీ ప్రత్యేక హోదా గురించి అడిగితే.. పొత్తు నుంచి విడిపోయే ప్రమాదం ఉంది.
ఏళ్లు గడుస్తున్నా.. ప్రభుత్వాలు మారుతున్నా కూడా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అనేది రావడం సాధ్యం కాని పనే అని చెప్పాలి. అందులోనూ భారతీయ జనతా పార్టీ మళ్లీ లోక్ సభలో అత్యధిక స్థానాలతో గెలిస్తే మాత్రం ఇక ఏపీ ప్రత్యేక హోదాను మర్చిపోవడమే మంచిది.
కాంగ్రెస్ హామీ ఇచ్చింది కానీ..
తెలంగాణ ఎన్నికల్లో విజయ దుంధుభి మోగించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ అధికారంలోకి రావాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు వైఎస్ షర్మిళ సేవలను వాడుకుంటోంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఇప్పుడైతే సాధ్యం కాని పని. అయితే.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల ఓ హామీ ఇచ్చారు. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం ప్రత్యేక హోదాపైనే ఉంటుంది అని. అది జరగాలంటే.. కేంద్రంలో కూడా కాంగ్రెసే అధికారంలోకి రావాలి. అలా కాకుండా కేవలం ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని నిలదీయడమే ఉంటుంది కానీ సొంతంగా ప్రకటించేసుకోవడానికి వీలు లేదు. (AP Elections)