Viral News: ప్రేయసిని మోసం చేసాను.. కానీ తనే కావాలనిపిస్తోంది
Viral News: ప్రేమ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ కాలం వారికి అసలు తెలీకుండాపోతోంది. ఒకప్పుడు చూపులు కలిసి మనసులు కలిస్తేనే ఆ తర్వాత ఐలవ్యూలు చెప్పుకునేవారు. ధైర్యం ఉంటే ఆ పెళ్లికి ప్రేమ దాకా కూడా తీసుకెళ్తున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. ముందు ముద్దు ముచ్చట్లు కానిచ్చేసి ఆ తర్వాత ఇంకా వారిపై ఇష్టం ఉంటే అది ప్రేమ అనుకుంటున్నారు. అందుకే చాలా ప్రేమ బంధాలు ఈ రోజుల్లో నిలబడటంలేదు. ఏది ఏమైనప్పటికి ఇద్దరు ప్రేమికుల్లో ఎవరో ఒకరు మోసం చేసినా కూడా వారిని క్షమించలేరు. వారి మోసాన్ని భరించలేక ఏళ్ల తరబడి ఏడుస్తూ ఉంటారు కానీ వారిని మర్చిపోలేరు. అలాగని వారిని మళ్లీ తమ జీవితంలోకి ఆహ్వానించలేరు. (Viral News)
మోసం చేసిన వారే మళ్లీ మన జీవితంలోకి రావాలనుకుంటే? వారు నిజంగా మారి వస్తే ఫర్వాలేదు. కానీ మన పొజిషన్, మన స్టేటస్‌ను చూసి మనతో ఉంటేనే బాగుంటుందేమో అని స్వార్ధంలో ఆలోచించేవారు మళ్లీ మన జీవితంలోకి రావాలనుకుంటే మాత్రం అలాంటివారిని పూర్తిగా దూరం పెట్టడమే బెటర్. ఇంతకీ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే.. మలేషియాకు చెందిన ఓ యువకుడు పియానో టీచర్ అయిన ఓ యువతితో ప్రేమలో ఉండి ఆమెను మోసం చేసాడు. దాంతో ఆమె రెండేళ్ల పాటు అతనికి దూరంగా ఉంటోంది. అయితే ఈ రెండేళ్లలో ఆమె ఎంతో సాధించింది. మంచి పొజిషన్లో ఉంది. ఈ విషయం ఆ యువకుడికి తెలిసి ఇప్పుడు ఆమె వద్దకే వెళ్లాలనుకుంటున్నాడు. ఈ విషయాన్ని సిగ్గులేకుండా డికార్డ్ అనే తైవాన్‌కు చెందిన సోషల్ నెట్వర్కింగ్ సైట్లో పోస్ట్ చేసాడు.
ALSO READ: జంటల మధ్య ఎంత వయసు వ్యత్యాసం ఉండాలి? ఎలాంటి వారికి సమస్యలు వస్తాయి?
ఆ అమ్మాయిని వదిలేసాక అతను చాలా మంది దగ్గరికి వెళ్లాడట. కానీ వారెవ్వరూ కూడా తన ప్రేయసిలా లేరట. దాంతో అతను తిరిగి తన మాజీ ప్రేయసి వద్దకే వెళ్లాలనుకుంటున్నాడు. “”” నేను ప్రేమించిన అమ్మాయిని అనవసరంగా వదులుకున్నాను. నిజానికి నేనే తనను మోసం చేసాను. మేం విడిపోయి రెండేళ్లు అవుతున్నప్పటికీ తనను రోజూ గమనిస్తూనే ఉన్నాను. తను రోజురోజుకీ అందంగా తయారవుతోంది. దాంతో నాకు ఆమెను ఎందుకు వదులుకున్నానా అనిపిస్తోంది. పైగా కెరీర్లో కూడా బాగానే రాణిస్తోంది. తను ఏకంగా ఓ కంపెనీ పెట్టిందని తన సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా తెలిసింది. తను ఒక పియానో టీచర్ కూడా. నేను ఇంత తక్కువ సమయంలో ఆమె లాగా సక్సెస్ అవుతానో లేదో కూడా తెలీదు. నాకు ఇప్పటికీ నా మాజీ ప్రేయసిపై ఫీలింగ్స్ ఉన్నాయి. ఈ రెండేళ్లలో నేను చాలా మంది అమ్మాయిలతో తిరిగాను. కానీ ఎవ్వరితోనూ నాకు నా మాజీ ప్రేయసితో ఉండే ఫీలింగ్ కలగలేదు. ఇప్పుడు నాకు ఆమెను ఎలా దక్కించుకోవాలో అర్థంకావడంలేదు “””” అని పోస్ట్ పెట్టాడు.
ఈ పోస్ట్ చూసిన నెటిజన్లకు మామూలుగా ఒళ్లు మండటం లేదు. ఆ అమ్మాయిని మోసం చేసిందే కాకుండా ఇప్పుడు తను మంచి పొజిషన్లో ఉందని మళ్లీ తనను వాడుకోవాలని చూస్తున్న ఇలాంటి అబ్బాయిల్ని నరికి పారేయాలంటూ కోపంతో తెగ కామెంట్స్ పెడుతున్నారు.