Niharika Konidela: నిహారిక‌ను హ‌ర్ట్ చేసిన ఆ న‌టుడు ఎవ‌రు?

Niharika Konidela: మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కూతురు, న‌టి నిహారిక‌ను ఓ యంగ్ హీరో హ‌ర్ట్ చేసాడ‌ట‌. ప్ర‌ముఖ OTT సంస్థ ఆహాలో (Aha) చెఫ్ మంత్ర సీజ‌న్ 3కి (Chef Mantra) నిహారిక హోస్ట్‌గా వ్య‌వ‌హరించాల్సి ఉంది. ఈ సీజ‌న్‌లో తొలి గెస్ట్‌గా ఓ యువ న‌టుడు మార్చి మొద‌టి వారంలో రిలీజ్ కానున్న త‌న మొద‌టి సినిమాను ప్రమోట్ చేసుకోవ‌డానికి వ‌స్తాన‌ని చెప్పార‌ట‌. దాంతో మాస్టర్ చెఫ్ టీం అంతా అత‌ని కోసం షోకి కావాల్సిన అన్నీ రెడీగా చేసి పెట్టారు. పాపం నిహారిక కూడా ఎంతో ఆతృత‌గా ఈ ఎపిసోడ్ కోసం ఎదురుచూసింది. (Niharika Konidela)

తీరా చూస్తే ఆ న‌టుడు రాకుండా హ్యాండ్ ఇచ్చాడ‌ట‌. ముందు ఒప్పుకున్నారు క‌దా మ‌రి ఏమైంది అని ఆహా టీం ఆయ‌న్ను సంప్ర‌దించ‌గా.. వంట‌ల ప్రోగ్రామ్‌లో సినిమాను ప్ర‌మోట్ చేస్తే ఎవ‌రు చూస్తారు అని అనేసాడ‌ట‌. దాంతో టీంతో పాటు నిహారిక కూడా అప్సెట్ అయ్యింది. ఆ న‌టుడు రాక‌పోతే మ‌రో గెస్ట్‌ని లైన్ అప్ చేసి ఉండ‌చ్చు క‌దా మొద‌టి ఎపిసోడ్‌పై చాలా హోప్స్ పెట్టుకున్నాను అని తెగ బాధ‌ప‌డ్డార‌ట.

ALSO READ: పుష్ప2లో నిహారిక.. క్లారిటీ ఇచ్చిన మెగా డాటర్​!

ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రా అని ఆరా తీయ‌గా..విశ్వ‌క్ సేన్ (Vishwak Sen) అని చాలా మంది అంటున్నారు. ఎందుకంటే మార్చి మొద‌టి వారంలో కాస్త పేరున్న హీరో సినిమా ఏద‌న్నా రిలీజ్ అవుతోంది అంటే అది విశ్వ‌క్ సేన్ న‌టించిన గామి (Gaami). ఈ సినిమా మార్చి మొద‌టి వారంలో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ముందు చెఫ్ మంత్ర‌కు వ‌స్తాన‌ని విశ్వ‌క్ ఒప్పుకున్నాడట‌. వారం రోజుల నుంచి చెఫ్ మంత్ర టీం విశ్వ‌క్‌కి ఫోన్లు చేస్తుంటే ఎపిసోడ్ షూటింగ్‌ని ఏదో ఒక ర‌కంగా వాయిదా వేస్తూ వ‌చ్చాడు. తీరా నిన్న‌టికి ప్రోగ్రామ్ డేట్ ఫిక్స్ అవ్వ‌గా.. విశ్వ‌క్ హ్యాండ్ ఇచ్చాడట‌. ఎన్నిసార్లు ఫోన్లు చేస్తున్నా రెస్పాండ్ అవ్వ‌క‌పోవ‌డంతో టీం అంతా అప్‌సెట్ అయ్యారు. అదేదో ముందే రాను అని చెప్తే వేరే గెస్ట్‌ని పిలిపించేవాళ్లం క‌దా ఇలా వ‌స్తాన‌ని రాకుండా త‌మ స‌మయం వృథా చేయాలా అని ఆహా టీం కూడా విశ్వ‌క్ సేన్‌పై మండిపడిన‌ట్లు తెలుస్తోంది.