Viral News: వాహ్.. ప్రేయసంటే ఎంత ప్రేమ గురూ..!
Viral News: ఇష్టమైన వారి పేర్లను టాటూగా వేయించుకునేవారి సంఖ్య కోకొల్లలు. కాకపోతే వారు ఛాతిపై, చేతిపై, మెడపై వేయించుకుంటూ ఉంటారు. కానీ పై ఫోటోలో కనిపిస్తున్న యువకుడు మాత్రం తన ప్రేయసి పేరును ఏకంగా కింద పెదవి భాగంలో వేయించుకున్నాడు. ఈ మధ్యకాలంలో నిబ్బ, నిబ్బి గాళ్లు ఎక్కువైపోయారు. వీరి వల్ల నిజమైన ప్రేమికుల పట్ల కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ ఎక్కువైపోయాయి. అభిషేక్ సక్పాల్ అనే టాటూ ఆర్టిస్ట్ షేర్ చేసిన వీడియోలో ఈ యువకుడి విషయం బయటపడింది. ఆ యువకుడు అభిషేక్ వద్దకు వచ్చి తన ప్రేయసి పేరు అమృత అని ఆమె పేరుని టాటూగా వేయించుకోవాలని అనుకుంటున్నానని చెప్పాడు. ఇందుకు అభిషేక్ ఓ తప్పకుండా వేస్తాను.. ఇంతకీ ఎక్కడ టాటూ వేయించుకోవాలని అనుకుంటున్నారు? అని అడిగాడు. ఇందుకు ఆ యువకుడు నా కింది పెదవిపై అని చెప్పడంతో అభిషేక్ షాకయ్యాడు. (Viral News)
ALSO READ: Viral News: ప్రియుడి మోసం.. అతని తండ్రిని పెళ్లాడిన ప్రేయసి..!
అసలే టాటూ ఇంక్ అంత మంచిది కాదు. చాలా మందికి టాటూ వల్ల స్కిన్ అలెర్జీ, ర్యాషెస్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిది ఆ అబ్బాయి పెదవిపై వేయించుకుంటాను అనడంతో అభిషేక్ చాలా సంకోచించాడు. ముందు వద్దనే వారించాడు. ఆ తర్వాత ఆ అబ్బాయికి తన ప్రేయసిపై ఉన్న ఆరాటాన్ని చూసి కాదనలేకపోయాడు. మొత్తానికి టాటూ వేసాక ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఇప్పటివరకు ఈ వీడియోకు ఏకంగా 90 లక్షల వ్యూస్ వచ్చాయి. చాలా మంది ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు ఇదేం పిచ్చి పని అని వారిస్తున్నారు.
నెటిజన్లు చేసిన కామెంట్స్ ఇలా ఉన్నాయి
రేపు బ్రేకప్ అయితే నీ పరిస్థితి ఏంటి బ్రో?
వేరొకరితో పెళ్లి జరిగినా ఆమెకు ఈ టాటూ గురించి తెలిసే ప్రసక్తే లేదు
ఎందుకు ఇలాంటి చెత్త విషయాలపై డబ్బులు వృథా చేస్తారు? ఆ డబ్బుతో మీ పళ్లు క్లీన్ చేయించుకోవచ్చు కదా?
మీ ప్రేయసి ఇలా టాటూ వేయించుకోమని ఫోర్స్ చేసిందా? మరి ఆమెను కూడా ఇలాగే మీ పేరును టాటూగా వేయించుకోమనండి.
పిచ్చోళ్ల గురించి వినడమే కానీ చూడటం ఇదే మొదటిసారి అన్నట్లు ఇలాంటి పిచ్చోళ్లు ఇంకా చాలా మందే ఉన్నారు. ఇటీవల ఆనా అనే యువతి కూడా తన ప్రియుడు కెవిన్ పేరుని ఏకంగా నుదుటిపై వేయించుకుంది. నొప్పిని భరిస్తూ రక్తం పోతున్నా కూడా టాటూ వేయించుకునే వెళ్తానని పట్టుబట్టింది. టాటూ ఆర్టిస్ట్‌లకు ఏం పోయింది? వారికి ఇంకా ఇలాంటి వారి వల్ల పాపులారిటీ డబ్బులు వస్తాయి. దాంతో వారు ఎక్కడ వేయమంటే అక్కడ టాటూలు వేసేస్తుంటారు. కానీ సెన్సిటివ్ ప్రదేశాల్లో టాటూలు వేయించుకోవడం ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నప్పటికీ టాటూ ఆర్టిస్ట్‌లు కూడా బేఖాతరు చేస్తున్నారు.