Rashmika Mandanna: విజయ్ దేవరకొండతో ప్రేమ.. కన్ఫామ్ చేసిన రష్మిక
Rashmika Mandanna: ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్లో నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన తన ప్రొఫెషనల్ లైఫ్‌లో జరిగే ప్రతి విషయాన్ని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ ఉంటారు. సినిమాలకు సంబంధించిన అప్డేట్స్, తన హెల్త్‌కి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పెడుతుంటారు. కానీ పర్సనల్ లైఫ్‌కి సంబంధించి మాత్రం చాలా జాగ్రత్తగా సీక్రెట్‌గా ఉంచుతారు. అఫ్కోర్స్ వారి పర్సనల్ లైఫ్ వారి ఇష్టం అనుకోండి. కానీ మనం ఊరుకోలేం కదా..! సెలబ్రిటీల పర్సనల్ లైఫ్‌లో ఏం జరుగుతోందో తెలుసుకోవాలన్న కుతూహలం అందరికీ ఉంటుంది. వారు చెప్పకపోయినా వారికి సంబంధించిన పర్సనల్ విషయాలు బయటికి వస్తే మాత్రం ఇక దాని గురించి తెలుసుకోకుండా ఉండలేం. ఇప్పుడు రష్మిక మందన విషయంలో కూడా ఇదే జరుగుతోంది. (Rashmika Mandanna)
రష్మిక మందన.. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) డేటింగ్లో ఉన్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. చాలా సార్లు వీరిద్దరూ కలిసే ట్రిప్స్‌కి వెళ్లడం.. పార్టీలకు వెళ్లడం వంటివి చూస్తున్నాం. ఇక దొరికిపోయారు కాబట్టి.. కళ్ల ముందు ఉన్నది నిజం కాదు అని చెప్పలేరు కాబట్టి.. ఇదే విషయం గురించి రష్మికను అడిగితే మేం ఫ్రెండ్స్ కదా.. ఫ్రెండ్స్ కలిసి ట్రిప్‌కి వెళ్లరా ఏంటి అని మాట దాటేసింది. ఆ తర్వాత రష్మిక విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటోలు దిగడం కూడా బయటికి రావడంతో వారిద్దరూ కలిసే ఉంటున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. అదీకాకుండా.. యానిమల్ (Animal) సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. (Sandeep Reddy Vanga) ఈ సినిమా కథను రష్మికకు చెప్పాలనుకున్నప్పుడు రష్మిక విజయ్ దేవరకొండ ఇంటి మిద్దెపై ఉందని బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) రివీల్ చేసేసాడు.
ALSO READ: ఇలాంటి చెత్త రూమర్స్ ఎక్కడి నుంచి వస్తాయ్?
ఇక వారు వీరు చెప్పడం కాదు.. ఏకంగా రష్మికనే తాను విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు ఆల్మోస్ట్ కన్ఫామ్ చేసేసారు. ఎక్కడ ఎప్పుడు అనుకుంటున్నారా? రష్మిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. అందులోనూ ట్విటర్లో చాలా త్వరగా ఫ్యాన్స్‌కు తన ఫ్యాన్ పేజెస్కు రిప్లై ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో రష్మిక మందన ఫ్యాన్ పేజ్ నుంచి ఒక ట్వీట్ బయటికి వచ్చింది. ఆ ట్వీట్లో ఏమని రాసుందంటే.. రష్మిక మందనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? రష్మిక నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఆమె భర్త ఇంకాస్త స్పెషల్ ఉండాలి. ఆమె భర్త VD లాగా ఉండాలి. VD అంటే వెరీ డేరింగ్ అని అర్థం. ఇలా ఉంటే రష్మికను కాపాడుకోగలుగుతాడు. మేం తనని క్వీన్ అని పిలుస్తాం. మరి ఆమె భర్త కింగ్‌లా ఉండాలి కదా..! అని రాసుంది.
ఈ ట్వీట్లో వారు VD అన్నప్పుడే అర్థమైపోయింది వారు మాట్లాడేది విజయ్ దేవరకొండ గురించి అని. ఈ ట్వీట్‌కు రష్మిక రిప్లై ఇస్తూ అది ముమ్మాటికీ నిజం అని రిప్లై ఇచ్చారు. అంటే ఇక మున్ముందు తన డేటింగ్ విషయాన్ని దాచకుండా ప్రకటించేస్తారేమో అన్న టాక్ వినిపిస్తోంది.