AP Elections: 9 సీట్లకు BJPతో డీల్ ఓకే..?!
AP Elections: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగు దేశం (Telugu Desam Party), జనసేన (Janasena) పార్టీలతో పొత్తుకు భారతీయ జనతా పార్టీ సిద్ధం అయినట్లు తెలుస్తోంది. 7 ఎంపీ, 10 అసెంబ్లీ సీట్లు కావాలని భారతీయ జనతా పార్టీ (BJP) కోరినట్లు సమాచారం. ఇందుకు తెలుగు దేశం పార్టీ కూడా ఒప్పుకుంది కానీ 5 ఎంపీ, 9 ఎమ్మెల్యే సీట్లకు బేరం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. సీట్ల ఒప్పందంపై త్వరలో భారతీయ జనతా పార్టీ నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇక ఎంపీ సీట్లను చూసుకున్నట్లైతే ఒంగోలు నుంచి పురంధేశ్వరి (Purandeswari), రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy), అరకు నుంచి కొత్త పల్లి గీత (Kothapalli Geetha), నరసాపురం నుంచి రఘు రామ రాజు (Raghu Rama Raju), తిరుపతి నుంచి రత్న ప్రభ (Ratna Prabha)బరిలోకి దిగనున్నారు. (AP Elections)
అసెంబ్లీ సీట్లు ఇలా..
ఉత్తర విశాఖపట్నం
తాడేపల్లిగూడెం
కదిరి
పొద్దుటూరు
ధర్మవరం
కైకలూరు
రాజోలు
కాకినాడ
ALSO READ: Chandrababu Naidu: కోడికత్తి కమల్ హాసన్ కొత్త డ్రామా..!
మొత్తం మీద భారతీయ జనతా పార్టీకి 5 ఎంపీ, 9 ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించిన పొత్తు కుదిరినట్లు తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు భారతీయ జనతా పార్టీతో ఏ విధంగా పొత్తు ఉండబోతోంది? అనే టెన్షన్ ఉండేది. కానీ భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఒకటే కోరుకుంది. ప్రతి పార్లమెంట్‌కి సంబంధించిన స్థానాల్లో ఒక సీటు అసెంబ్లీ స్థానం భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలని కోరింది. కానీ ఆ లెక్కన 25 సీట్లు భారతీయ జనతా పార్టీకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కానీ పొత్తులో భాగంగా కొంత చర్చలు జరిగిన నేపథ్యంలో అసెంబ్లీకి సంబంధించి 9 అసెంబ్లీ స్థానాలు ఎంపీలు మాత్రం దాదాపుగా 5 వరకు కన్ఫామ్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ దశలో అసెంబ్లీ నుంచి చూసుకుంటే… విశాఖ ఉత్తర, తాడేపల్లిగూడెం, కైకలూరు, రాజోలు, కాకినాడ, కదిరి, పొద్దుటూరు, ధర్మవరంతో పాటు మరో స్థానానికి కూడా అసెంబ్లీకి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఎంపీల విషయంలో ఐదు స్థానాలను భారతీయ జనతా పార్టీ గట్టిగా పట్టుబడుతోంది.
భారతీయ జనతా పార్టీకి సంబంధించి అసెంబ్లీకి సంబంధించిన వ్యవహారం ప్రకారం అయితే..దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. అందుకే ఈరోజు ధర్మవరం నుంచి పరిటాల కుటుంబాన్ని కాదని చెప్పి ఒక సీటే ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం నారా లోకేష్‌తో (Nara Lokesh) పరిటాల కుటుంబం కాస్త గట్టిగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ యాంగిల్‌లో అయితే భారతీయ జనతా పార్టీతో పొత్తు కూడా దాదాపు కన్ఫాన్ అయిపోయినట్లే తెలుస్తోంది. 34, 35 సీట్లకు డీల్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. ఇందుకు తెలుగు దేశం పార్టీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఫైనల్‌గా ఈ సీట్లను తెలుగు దేశం పార్టీ ఇచ్చిందా లేక భారతీయ జనతా పార్టీ అడిగిందా అనే అంశంపై రెండు రోజుల్లో ఒక అధికారిక సమావేశాన్ని ఏర్పాటుచేసి ప్రజలకు తెలియజేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
మొత్తానికి తెలుగు దేశం, జనసేతో కలిసేందుకు భారతీయ జనతా పార్టీ ఒప్పుకుంది. నిజానికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ జనసేనతో పొత్తును బహిరంగంగా ప్రకటించింది. ఆ తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్.. భారతీయ జనతా పార్టీ హైకమాండ్‌తో మాట్లాడకుండానే తెలుగు దేశంతో పొత్తు ప్రకటించేసారు. దాంతో భారతీయ జనతా పార్టీ వీరితో కలుస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. లోలోపల తెలుగు దేశంతో కలవాలని భారతీయ జనతా పార్టీకి లేకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో తమ ఉనికిని చాటుకునేందుకు తప్పక మనసొప్పక పొత్తుకు ఓకే చెప్పినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.