AP Elections: బాబు మార్క్.. జగన్ షాక్..!

AP Elections: ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు మ‌రింత ర‌సవ‌త్త‌రంగా మార‌నున్నాయి. ఎందుకంటే తెలుగు దేశం (Telugu Desam Party), జ‌న‌సేన (Janasena) పార్టీలు తొలి అభ్య‌ర్ధుల జాబితాను ప్ర‌క‌టించేసారు. మ‌రోప‌క్క YSRCP లిస్ట్ ప్ర‌క‌టించేసి వాళ్లు స్పీడ్‌గా వెళ్తున్నారు.. తెలుగు దేశం, జ‌న‌సేన పార్టీలు మాత్రం సీట్ల‌కు సంబంధించిన క్లారిటీ రాలేద‌న్న టెన్ష‌న్ క్లియ‌ర్‌గా క‌నిపిస్తోంది. 175 స్థానాల‌కు గానూ 24 స్థానాలు జ‌న‌సేన పార్టీకి 151 స్థానాలు తెలుగు దేశం పార్టీకి ద‌క్కాయి. (AP Elections)

మ‌ళ్లీ 24 నుంచే భార‌తీయ జ‌న‌తా పార్టీకి (BJP) కేటాయించాలి. 25 పార్ల‌మెంట్ స్థానాల‌కు గానూ 3 జ‌న‌సేన పార్టీ మిగిలిన‌వి 22 స్థానాల‌కు గానూ అందులో భార‌తీయ జ‌న‌తా పార్టీకి ప్ల‌స్ తెలుగు దేశానికి క‌లిపి ద‌క్క‌నున్నాయి. ఇందులో మ‌నం గ‌మ‌నించాల్సిన అంశం ఏంటంటే.. ఈరోజు 94 మంది అభ్య‌ర్ధుల‌ను తెలుగు దేశం పార్టీ ప్ర‌క‌టించింది. 24లో ఐదుగురు అభ్య‌ర్ధుల‌ను జ‌న‌సేన ప్ర‌క‌టించింది. అంటే ఇంకా 76 స్థానాల‌ను ప్ర‌క‌టించాల్సి ఉంది. పార్ల‌మెంట్ స్థానాల‌ను కూడా క‌లిపితే 25 పార్ల‌మెంట్ స్థానాల‌కు గానూ 101 స్థానాల‌ను ప్ర‌క‌టించాల్సి ఉంది. అంటే ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌క‌టించింది 50 శాతం మాత్ర‌మే. ఇంకా 50 శాతం సీట్ల‌ను ప్ర‌క‌టించాల్సి ఉంది.

ALSO READ: Janasena: BJP ఆశీస్సులు ఉన్నాయ్.. త్యాగం త‌ప్ప‌దు

ఈ ప్ర‌క‌ట‌న మార్చి మొద‌టి వారంలో రానున్న‌ట్లు తెలుస్తోంది. 94 సీట్ల‌లో ఇంకా తెలుగు దేశం పార్టీ 57 స్థానాల‌ను ప్ర‌క‌టించాలి. జ‌న‌సేన 5 ప్ర‌క‌టించింది కాబ‌ట్టి 19 స్థానాల‌ను ప్ర‌క‌టించాల్సి ఉంది. ఇరు పార్టీల అధినేత‌లు సీట్లు, అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించాక వారు ఆల్మోస్ట్ ఎన్నిక‌ల్లో గెలిచేసాం అనే ధీమాతో ఉన్నారు. మొత్తం సీట్ల‌లో గానూ దాదాపు 18 మంది బీసీలు, 20 మంది ఎస్సీలు, ముగ్గురు ఎస్టీలు, ప‌ది మంది కాపులు, 22 మంది క‌మ్మ‌, 17 మంది రెడ్ల‌కు, ఇద్ద‌రు వైశ్యల‌కు, 2 క్ష‌త్రియ‌కు, 1 వెల‌మ‌కు, 1 మైనారిటీకి ప్ర‌క‌టించారు.

YSRCP ప్ర‌క‌టించిన లిస్ట్‌తో తెలుగు దేశం, జ‌నసేన ఉమ్మ‌డి లిస్ట్‌ని పోల్చి చూస్తే ఇరు పార్టీల వారు చ‌దువుకున్న‌వారికే ఎక్కువ‌గా కేటాయించారు. 94 మందిలో 25 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్, 50 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. ముగ్గురు డాక్ట‌ర్లు, ఇద్ద‌రు పీహెచ్‌డీ, ఒక‌రు ఐఏఎస్ చేసిన వారు కూడా ఉన్నారు. వీటితో పాటు 23 మంది కొత్త‌వాళ్ల‌కు సీట్లు ద‌క్కాయి. వీరిలో పురుషులు 86 మంది, మ‌హిళ‌లు 13 మంది ఉన్నారు.

ఇక్క‌డ మ‌రో ప్ర‌త్యేక‌త ఉంది. అదేంటంటే.. అమ‌రావ‌తి కోసం పోరాడిన‌ కొలికిపూడి శ్రీనివాస్‌కి తిరువూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి సీటు ప్ర‌క‌టించారు. ద‌ళిత ఉద్య‌మంతో పోరాడిన మ‌హాసేన రాజేశ్‌కి కూడా కేటాయించారు. వీరిద్ద‌రూ ప్ర‌భుత్వంపై గ‌త ఐదు సంవ‌త్స‌రాలుగా పోరాడుతూనే ఉన్నారు. అనేక అంశాల‌పై యుద్ధాన్ని ప్ర‌క‌టించారు. వీరిపై కేసులు కూడా పెట్టారు. అయినా గానీ వీరు ఎక్క‌డా కూడా వెనక్కి త‌గ్గ‌కుండా పోరాడుతున్నారు. వీరిద్ద‌రినీ ప్ర‌త్యేకంగా చూడాల‌ని నారా లోకేష్ ప‌ట్టుబ‌ట్టారు.

వైసీపీతో యుద్ధం చిన్న విష‌యం కాదు. చాలా మంది యుద్ధాలు చేయ‌లేక త‌ప్పుకున్న‌వారు ఉన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారూ ఉన్నారు. కేసుల దెబ్బ‌కు క‌న‌ప‌డ‌కుండా పోయిన‌వారూ ఉన్నారు. కానీ వీరిద్ద‌రూ మాత్రం ప్ర‌త్యేకంగా ఆ స్థానాల నుంచి ఎన్నుకోవ‌డం ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిన విష‌యం. వీరితో పాటు వ‌ర్ల కుమార్ రాజా (వ‌ర్ల రామ‌య్య కుమారుడు) కూడా సీటు కేటాయించారు. ఎన్నారై గోనెల్ల విజ‌య్‌కి కూడా టికెట్ ద‌క్కింది. మొద‌టిసారి రిజ‌ర్వ్ నియోజ‌క‌వ‌ర్గాల నుంచి ఫైన‌ల్ చేసిన అభ్య‌ర్ధుల్లో ఎక్కువ మంది చ‌దువుకున్న పోరాడిన వారే ఉన్నారు. ఇది కాస్త ఊర‌ట క‌లిగించే అంశ‌మే. మొత్తానికి తెలుగు దేశం, జ‌న‌సేన పార్టీల ఉమ్మ‌డి లిస్ట్‌ని చూస్తే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కాస్త కంగారుప‌డుతున్నార‌ని.. ఆయ‌న పెట్టుకున్న అభ్య‌ర్ధుల కంటే బెట‌ర్ అభ్య‌ర్ధుల‌ను చంద్ర‌బాబు నాయుడు ఎంపిక‌చేసార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.