AP Elections: TDP వ్యూహం అదుర్స్..!

AP Elections: 2019 ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో కాపు వ‌ర్గాల‌ను త‌మ వైపు తిప్పుకోవ‌డంలో YSRCP విజ‌యం సాధించింది. దీనికి ప్ర‌ధాన కార‌ణం మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ (Botcha Satyanarayana) అనే చెప్పాలి. ఇటు ఈ జిల్లాల్లో ఉన్న ప‌రిచ‌యాల‌ను దృష్టిలో పెట్టుకుని పార్టీ అధిష్ఠానం బొత్స కుటుంబానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో ఈ ఫ్యామిలీ నుంచే ఎక్కువ శాతం మంది 2019 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. అయితే.. ఇప్పుడు తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) అంశంపై సీరియ‌స్‌గానే దృష్టి పెట్టింది. బొత్స కుటుంబాన్ని ఎదుర్కొనే కాపు సామాజిక వ‌ర్గ నేత‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం ద్వారా ఆ లోటును భ‌ర్తీ చేసే ప‌నిలో ప‌డింద‌ట తెలుగు దేశం పార్టీ హై క‌మాండ్. బొత్స కుటుంబాన్ని రాజ‌కీయంగా ఎదుర్కొనే స‌త్తా ఉన్న కాపు సామాజిక వ‌ర్గం నేత‌ల‌ను తెలుగు దేశం పార్టీ రంగంలోకి దింపుతోంది. (AP Elections)

ALSO READ: YS Sharmila: ఓ చెల్లిగా అర్థం చేసుకున్నా.. పొత్తుకు సై ..!

తెలుగు దేశం పార్టీ ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో కాపు సామాజిక వ‌ర్గాల‌కు చెందిన మాజీ మంత్రి కిమిడి క‌ళా వెంక‌ట్రావ్ (Kala Venkatrao) కుటుంబానికి మంచి ప‌రిచ‌యాలు ఉన్నాయి. తెలుగు దేశం ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న ఈ కుటుంబం మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ స్పీడ్‌కు బ్రేకులు వేయ‌గ‌ల‌దు అనే ఆలోచ‌న‌లో తెలుగు దేశం పార్టీ చంద్ర‌బాబు నాయుడు ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాల్లోని కాపుల‌ను తెలుగు దేశం పార్టీలోకి తీసుకొచ్చే బాధ్య‌త‌ను క‌ళా వెంక‌ట్రావుకు అప్ప‌గించిన‌ట్లు తెలుస్తోంది. ఇదే క్ర‌మంలో రెండు జిల్లాల్లో జరుగుతున్న పార్టీ కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌వుతున్నారు.

మ‌రో వైపు క‌ళా వెంక‌ట్రావు గ‌తంలో తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. 2019 ఎన్నిక‌ల్లో అధికారానికి దూరం అవ‌డంతో సామాజిక వ‌ర్గ పరంగా అంత‌గా ప్ర‌భావం చూప‌లేక‌పోయారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌ళా వెంక‌ట్రావ్ కటుంబానికి ప్రాధాన్య‌త ఇస్తే కాపుల ఓట్లు పార్టీకి ప్లస్‌గా మార‌తాయ‌నే భావన రాజ‌కీయ వ‌ర్గాల్లో వ్య‌క్తం అవుతోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఉత్త‌రాంధ్ర కాపులు ఎవ‌రి వైపు మొగ్గు చూపుతారో చూడాలి మ‌రి.

ALSO READ: Pawan Kalyan: ప‌రిణితి చెందారు.. ప‌వ‌ర్ మంత్రం ప‌ట్టేసారు

వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను తెలుగు దేశం పార్టీ చాలా సీరియ‌స్‌గా తీసుకుంది. గెలుపు కోసం ఉన్న ప్ర‌తి అవ‌కాశాన్ని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే విధంగా పార్టీ పెద్ద‌లు వ్యూహ ర‌చ‌న చేస్తున్నారు. ప్ర‌ధానంగా ఉత్త‌రాంధ్ర‌లో పూర్వ వైభ‌వం తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు స‌త్ఫ‌లితాల‌ను ఇస్తున్నాయ‌నే టాక్ న‌డుస్తోంది. ఉత్త‌రాంధ్ర‌లో ఏ పార్టీ సీట్లు ఎక్కువ‌గా గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌నే సెంటిమెంట్ ఉంది. ఈ క్ర‌మంలోనే సైకిల్ పార్టీ ఉత్త‌రాంధ్ర జిల్లాల‌పై ఫోక‌స్ పెట్టింది. దీనిలో భాగంగా విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాల్లో సామాజిక వ‌ర్గ ప‌రంగా ప్ర‌భావం చూపించే అధికార పార్టీ నేత‌ల‌కు చెక్ పెట్టే ఆలోచ‌న‌లో తెలుగు దేశం ఉంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

వాస్త‌వానికి ఇటు శ్రీకాకుళం అటు విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో కాపు సామాజిక వ‌ర్గ ఓటర్లు ఎక్కువ‌. 2019 ఎన్నిక‌ల్లో YSRCP ఈ వ‌ర్గాల‌ను త‌మ వైపు తిప్పుకోవ‌డంలో స‌క్సెస్ అయింది. ఇప్పుడు ఆ ఓట్ల‌ను త‌మ వైపున‌కు తిప్పుకునేందుకు తెలుగు దేశం పార్టీ చేస్తున్న కృషి అంతా ఇంతా కాదు. ఈసారి ఎన్నిక‌ల్లో తాను గెల‌వ‌డం సాధ్యం కాదేమోన‌ని బొత్స సత్య‌నారాయ‌ణ కూడా దిగులు చెందుతున్న‌ట్లు సన్నిహిత వ‌ర్గాల స‌మాచారం.